Corona Update : దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది

Corona Update : దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

Corona Update

Corona Update : దేశంలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇక గడిచిన 24 గంటలలో కరోనా నుంచి కోలుకొని 8,043 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లారు. అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికి మరణాల శాతం పెరుగుతుంది.

చదవండి : AP Corona : బిగ్ రిలీఫ్.. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆ 3 జిల్లాలో జీరో కోవిడ్

గడిచిన 24 గంటల్లో 453 మంది మృత్యువాడ పడినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం 79,097 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
దేశంలో ఇప్పటివరకు 3,47,52,164 కేసులు నమోదవగా.. 3,41,95,060 మంది కోలుకున్నారు. 4,78,007 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

చదవండి : Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకోనంటూ తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్న వ్యక్తి

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు 1,38,34,78,181 డోసుల పంపిణి చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మూడు వరాల వ్యవధిలో 1 కేసు నుంచి 173కి చేరింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తుంది.