Union Cabinet : 6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.

Union Cabinet : 6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

Package

Union Cabinet కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. కాగా,ఉత్పత్తి, ఎగుమతులు, ఉపాధి అవకాశాల్ని పెంచేందుకు ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.6,28,993 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో రూ. 1.5లక్షల కోట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం కేటాయించారు. ఆరోగ్య రంగం, పర్యటకానికి కేంద్రం ఈ ప్యాకేజీలో పెద్ద పీఠ వేసింది.

ఇక, భారత్​నెట్​ పథకానికి రూ.19,041కోట్లు కేటాయించేందుకు బుధవారం కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. 16 రాష్ట్రాల్లోని 3 లక్షల 60 వేల గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు భారత్‌నెట్ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విదానంలో చేపడతాయని కేబినెట్ మీటింగ్ అనంతరం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు 1.56 లక్షల గ్రామాలకు బ్రాడ్​ బ్యాండ్ సౌకర్యం అందించినట్లు రవిశంకర్ తెలిపారు. అలాగే 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.