Bengal: బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణ.. కేంద్ర మంత్రిపై రాళ్ల దాడి
బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఓ గిరిజనుడి మృతిపై హోంశాఖకు మంత్రి నిసిత్ సమర్పించిన నివేదికపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి ముందు టీఎంసీ జాతీయ ప్రధాని కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం నిసిత్ ప్రామాణిక్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. నిసిత్ ఎక్కడ కనిపించినా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Union Minister Nisith Pramanik's convoy attacked in Bengal
Bengal: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్‌పై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శనివారం దాడి జరిగింది. కూచ్‌బెహార్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. నిశిత్ ప్రామాణిక్ ప్రయాణిస్తున్న కారు ముందు అద్దం ధ్వంసమైంది. అయితే ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో ఎప్పటిలాగే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ ఘర్షణలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Heroes on the Road: ఆ ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు హీరోలు.. కేంద్రమంత్రి గడ్కరీ చేతుల మీదుగా తొందరలో అవార్డులుఅయితే కేంద్ర మంత్రి కాన్వాయ్ మీద దాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు వెనక్కితగ్గకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.
కూచ్‌బెహార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నిశిత్ ప్రామాణిక్ ప్రాతినిధ్యం ఎన్నికలయ్యారు. ఈ ఘటనపైఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘ఒక కేంద్రమంత్రికే రక్షణ లేదంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు’’ అని ప్రామాణిక్ మండిపడ్డారు.
Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు