Smriti Irani: ప్రేమ అని మాట్లాడుతున్నారు.. అది ఇందులో భాగమేనా రాహుల్?: స్మృతీ ఇరానీ

బీజేపీ చిమ్ముతున్న విద్వేషాన్ని ఓడించి, ప్రేమను పంచుతామని రాహుల్ అంటున్నారు.

Smriti Irani: ప్రేమ అని మాట్లాడుతున్నారు.. అది ఇందులో భాగమేనా రాహుల్?: స్మృతీ ఇరానీ

Smriti

Smriti Irani – BJP: బీజేపీది విద్వేష దుకాణం.. తమది ప్రేమ దుకాణం అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తోన్న వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో విద్వేషం ఓడిందని, ప్రేమ గెలిచిందని రాహుల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, బీజేపీ విద్వేష దుకాణాన్ని అన్ని ప్రాంతాల్లో మూసేసి ప్రేమ దుకాణాన్ని తెరిచి ప్రేమను పంచుతామని ఇటీవల రాహుల్ పలుసార్లు అన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై స్మృతీ ఇరానీ స్పందిస్తూ… ” ప్రేమ అని మాట్లాడుతున్నారు.. సిక్కులను చంపడం కూడా ఇందులో భాగమేనా? రాజస్థాన్ లో మహిళలను కిడ్నాప్ చేస్తుండడం కూడా మీ ప్రేమలో భాగమేనా?

భారత్ అభివృద్ధిలో ముందుకు వెళ్లకుండా చేయాలనుకునేవారితో భాగస్వాములు కావడం కూడా మీ ప్రేమలో భాగమేనా? భారత ప్రజాస్వామ్యంలో విదేశాలు జోక్యం చేసుకోవాలని కోరడానికి మీ ప్రేమే కారణమా? ఇదెక్కడి ప్రేమ? ” అని ఎద్దేవా చేశారు.

కాగా, విదేశీ పర్యటనల్లోనూ ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాము బీజేపీ చిమ్ముతున్న విద్వేషాన్ని ఓడించి, ప్రేమను పంచుతామని రాహుల్ అంటున్నారు.
Byreddy Siddhartha Reddy : జగన్ మ్యానిఫెస్టో ఎట్టుంటదో తెలుసా..? అది విన్న జనం రియాక్షన్ చూస్తారుగా..