UP CM Yogi Adityanath : మాఫియాను మట్టిలో కలిపేస్తా : సీఎం యోగీ అదిత్యానాథ్
బుల్డోజర్‌లతో కూల్చివేతలు.. తూటాల వర్షాలు.. గోలీమార్ అంటున్న యోగి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం యోగీ ఇది టీజర్ మాత్రమే సినిమా ముందుంది అంటున్నారు.

UP CM Yogi Adityanath
UP CM Yogi Adityanath : యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్ ఇచ్చి మరీ మాఫియాను మట్టి కరిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మాఫియాను మట్టిలో కలిపేస్తా అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం యోగీ ప్రకటించారు. అన్నట్లుగా వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో ఉమేష్ పాల్ హత్య కేసు మరుసటిరోజునే యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్న వెంటనే సీన్ లోకి ఎంటర్ అయిపోయారు. యూపీలో వరస ఎన్ కౌంటర్లతో హడలెత్తిస్తున్నారు. యోగీ ప్రకటించినట్లుగా ఉమేష్ పాల్ హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. వేరు వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు చనిపోయారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌ని ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఝాన్సీ జిల్లాలో ఈ ఘటనలో అతడి సహాయకుడు గులాం సైతం హతమయ్యాడు.
వారం క్రితం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు వేలు చూపిస్తూ ‘మాఫియా రాజ్ కో మిట్టీ మే మిలాదూంగా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకటించినట్లుగానే ఉమేష్ పాల్ హత్య కేసులో నిందుతులు ఎన్ కౌంటర్ లో పిట్టల్లా రాలిపోయారు. సవాల్ చేసి వారం తిరగకముందే.. ఉమేష్‌పాల్ కేసులో కీలక నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. బుల్డోజర్‌లతో కూల్చివేతలు.. తూటాల వర్షాలు.. గోలీమార్ అంటున్న యోగి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యలో ప్రధానసాక్షి ఉమేష్ పాల్‌ను కొంతమంది దుండగులు ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపారు. దీనిపై అఖిలేష్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్‌ను నిలదీస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని విమర్శలు గుప్పించారు. దీంతో యోగి తన విశ్వరూపం చూపించారు. కట్ చేస్తే.. వారం తిరిగే సరికి ఉమేష్ పాల్ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు.
ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో ఉమేష్ పాల్ తన ఇంటి బయటే పట్టపగలు దారుణ హత్యకు గురి అయ్యాడు. ఈ హత్య యూపీలో సంచలనంగా మారింది. ఆ మరుసటిరోజే సీఎం యోగా మాఫియాను మట్టిలో కలిపేస్తాం అంటూ వ్యాఖ్యాలు చేశారు. ఈ హత్య కేసులో యూపీ పోలీసులు మరో నిందితుడిని ఎన్‌కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్‌పై మొదట కాల్పులు జరిపిన ఉస్మాన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర దుమారం రేగింది. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్న సీఎం యోగి.. ఉమేశ్ భార్య ఫిర్యాదుతో మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్న సమయంలో.. విజయ్ అలియాస్ ఉస్మాన్‌ను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు పోలీసులు.
అసెంబ్లీలో రచ్చ జరగడం.. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ ఘటనలో.. యూపీ పరిణామాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మాఫియాను మట్టుపెట్టేందుకు యోగి మరింత దూకుడుమీదున్నని తెలుస్తోంది. ఓవైపు మాఫియాపై యోగి సర్కార్ చర్యలు తీసుకోవటం..మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. అయిన యోగీ సర్కార్ దూకుడు మాత్రం ఆగటలేదు. యూపీలో తాజా పరిణామాలు జస్ట్ టీజర్ మాత్రమే అని.. యోగి మార్క్ అసలు యాక్షన్ ముందుముందు కనిపించే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.