UP Election 2022: నేడే ఉత్తరప్రదేశ్‌లో ఆరవ దశ ఎన్నికలు.. 57 స్థానాల్లో ఓటింగ్!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆరవ దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌తో సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది.

UP Election 2022: నేడే ఉత్తరప్రదేశ్‌లో ఆరవ దశ ఎన్నికలు.. 57 స్థానాల్లో ఓటింగ్!

Up

UP Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆరవ దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌తో సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు(03 మార్చి 2022) ఓటింగ్ జరగనుంది. ఆరో దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అజయ్ కుమార్ శుక్లా వెల్లడించారు.

ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని శుక్లా తెలిపారు. మార్చి 3న ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ దశలో రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 57 సీట్లలో 46 బీజేపీ, రెండు దాని మిత్రపక్షాలు అప్నా దళ్ (S), సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SubhSP) గెలుచుకున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని సుభాఎస్పీ పోటీ చేస్తోంది. ఆరో దశ పది జిల్లాల్లో అంబేద్కర్ నగర్, బలరాంపూర్, సిద్ధార్థనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహరాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, డియోరియా, బల్లియా జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

ఆరో దశలో 57 సీట్లలో 11 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ దశలో మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపాదిత ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు దశల్లో 292 స్థానాల్లో ఓటింగ్ నిర్వహించగా, చివరి రెండు దశల్లో వరుసగా మార్చి 3, మార్చి 7 తేదీల్లో 111 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది.