Covid Vaccines : 11 కోట్ల డోసులు ఉన్నా..వ్యాక్సిన్లను సరిగా వినియోగించుకోని ఐదు రాష్ట్రాలు ఇవే!

:  దేశంలో ఐదు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లను సరిగా ఉపయోగించుకోవడంలేదని తాజా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,బీహార్,రాజస్తాన్

Covid Vaccines : 11 కోట్ల డోసులు ఉన్నా..వ్యాక్సిన్లను సరిగా వినియోగించుకోని ఐదు రాష్ట్రాలు ఇవే!

Vaccine

Covid Vaccines :  దేశంలో ఐదు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లను సరిగా ఉపయోగించుకోవడంలేదని తాజా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,బీహార్,రాజస్తాన్ రాష్ట్రాల్లో దాదాపు 11 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ బాలెన్స్ డోసులు ఉన్నట్లు కేంద్రం ఆరోగ్యశాఖ మంగళవారం రాజ్యసభకు తెలిపింది.

ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా వినియోగించని కోవిడ్ వ్యాక్సిన్ డోసులు 2.9 కోట్లు ఉండగా,బెంగాల్ లో 2.5 కోట్లు,మహారాష్ట్రలో 2.2 కోట్లు,బీహార్ లో 1.80 కోట్లు,రాజస్తాన్ లో 1.43కోట్లు,తమిళనాడులో 1.35 కోట్లు,మధ్యప్రదేశ్ లో 1.1 కోట్ల వినియోగించని వ్యాక్సిన్ డోసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వద్ద మొత్తం 23 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

ఇక, కొన్ని రాష్ట్రాలు అత్యధిక టీకాలు వేయని జనాభాను కలిగి ఉన్నాయని, ఆ రాష్ట్రాల్లో ఇంకా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకోనివారు కూడా చాలా మంది ఉన్నారని తెలిపింది. దేశంలోనే పెద్ద రాష్ట్రం యూపీలో 3.50 కోట్ల మంది ఇంకా మొద‌టి డోసునే తీసుకోలేదు. బిహార్‌లో 1.89 కోట్ల మంది, మ‌హారాష్ట్ర‌లో 1.71కోట్లు, త‌మిళ‌నాడులో 1.24 కోట్ల మంది ఇంకా మొద‌టి డోసును తీసుకోలేద‌ని కేంద్ర ఆరోగ్యశాఖ డేటా చెబుతోంది.

ALSO READ Bihar’s Vaccine Data : మోదీ,షా,సోనియా,ప్రియాంక చోప్రా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది బీహార్ లోనే!