Panchayat Election : యూపీ ఎన్నికలు.. 75 స్థానాల్లో 67 చోట్ల బీజేపీ విజయం

ఉత్తర ప్రదేశ్ లో శనివారం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలిచి సత్తా చాటింది. రాష్ట్రంలోని 75 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరగ్గా 67 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ 6 స్థానాలకే పరిమితమైంది. 

Panchayat Election : యూపీ ఎన్నికలు.. 75 స్థానాల్లో 67 చోట్ల బీజేపీ విజయం

Panchayat Election

Panchayat Election : ఉత్తర ప్రదేశ్ లో శనివారం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలిచి సత్తా చాటింది. రాష్ట్రంలోని 75 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరగ్గా 67 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ 6 స్థానాలకే పరిమితమైంది.  ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీలోను బీజేపీ విజయం సాధించింది.

రాష్ట్రంలో 3000 మంది పంచాయితీ సభ్యులు, 75 మంది జిల్లా పరిషత్ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉండగా ఇందులో 22 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.. ఏకగ్రీవమైన వారిలో బీజేపీకి చెందిన వారు 21 మంది, సమాజ్ వాదీ పార్టీ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. ఇక గతంలో జరిగిన జిల్లా పంచాయితీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ 63 జిల్లా పంచాయితీలను కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ రికార్డును బీజేపీ తుడిపేసింది.

బీజేపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఈ ఫలితాలే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృత్తం అవుతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు బీజేపీ వెంట ఉన్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.