Joshimath Sinking : ద్వారకలానే.. చరిత్రలో కలిసిపోనున్న మరో చారిత్రక పట్టణం..! జోషిమఠ్‌లో భయం భయం

కృష్ణుడు పాలించిన ద్వారక సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సముద్ర గర్భం నుంచి పలు అవశేషాలు బయటపడితే ద్వారక మునిగిపోవటం నిజమని మనం తెలుసుకున్నాం. పురావస్తు శాస్త్రవేత్తలు ద్వారక చరిత్రపై ఎన్నో ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. ఇది చరిత్ర. అప్పుడేం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, అప్పుడు ద్వారకలానే ఇప్పుడు మరో పట్టణం చరిత్రలో కలిసిపోతోంది. ఓ చారిత్రక పట్టణం రోజురోజుకు భూమి పొరల్లోకి కుంగిపోతోంది. ఏమిటీ వైపరిత్యం? అసలు ఎందుకిలా జరుగుతోంది?

Joshimath Sinking : ద్వారకలానే.. చరిత్రలో కలిసిపోనున్న మరో చారిత్రక పట్టణం..! జోషిమఠ్‌లో భయం భయం

Joshimath Sinking : కృష్ణుడు పాలించిన ద్వారక సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సముద్ర గర్భం నుంచి పలు అవశేషాలు బయటపడితే ద్వారక మునిగిపోవటం నిజమని మనం తెలుసుకున్నాం. పురావస్తు శాస్త్రవేత్తలు ద్వారక చరిత్రపై ఎన్నో ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. ఇది చరిత్ర. అప్పుడేం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, అప్పుడు ద్వారకలానే ఇప్పుడు మరో పట్టణం చరిత్రలో కలిసిపోతోంది. ఓ చారిత్రక పట్టణం రోజురోజుకు భూమి పొరల్లోకి కుంగిపోతోంది. ఏమిటీ వైపరిత్యం? అసలు ఎందుకిలా జరుగుతోంది?

జోషిమఠ్.. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పట్టణం. పరమ పవిత్రంగా భావించే చార్ దామ్ యాత్రల్లో ఒకటైన బద్రినాథ్ క్షేత్రానికి ముఖ ద్వారం జోషిమఠ్. అంతేకాదు, అది శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పర్వత శిఖరం ఇప్పుడు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. రోజురోజుకు కాలగర్భంలో కలిసిపోయేలా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

Joshimath Sinking

జోషిమఠ్ పట్టణంలో గత కొన్నేళ్లుగా భూమి పగుళ్లు ఇస్తోంది. నేల చీరటంతో ఇళ్లు బీటలు వారుతున్నాయి. భూమి లోపల నుంచి వస్తున్న ఏవేవో శబ్దాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఉన్నట్టుండి భూగర్భం నుంచి ఉబికి వస్తున్న నీరు జోషిమఠ్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జోషిమఠ్ ప్రమాదకర స్థితికి చేరుకుంటోందని 50ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు హెచ్చరించారట.

Also Read..Joshimath Sinking : రోడ్లపై పగుళ్లు, కూలుతున్న ఇళ్లు, కుంగుతున్న భూమి.. జోషిమఠ్‌లో అసలేం జరుగుతోంది? ఈ భయానక పరిస్థితులకు కారణం ఏంటి?

అప్పట్లో ఊరు భూమిలో కలిసిపోతుందని చెప్పిన శాస్త్రవేత్తలకు శాపనార్థాలు పెట్టిన స్థానికులు ఇప్పుడు జరుగుతున్నది చూసి ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా జోషిమఠ్ లో కాళ్ల కింద భూమి కదులుతోంది. రోజురోజుకి ఇళ్లు భూగర్భంలోకి దిగిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం జోషిమఠ్ లో 561 ఇళ్లు పగుళ్లు తేలాయి. గంటగంటలకు ఇవి పెద్దవి అవుతున్నాయి.

Joshimath Sinking

ఈ పరిణామంతో పట్టణవాసులు కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. పరిస్థితిని అంచనా వేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం 66 కుటుంబాలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించింది. అంతేకాదు ఆసియాలోనే అతిపెద్ద రోప్ వే జోషిమఠ్ లోనే ఉంది. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో రోప్ వే ప్రయాణాలను నిలిపివేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.