Pushups : వైరల్ వీడియో.. కళ్యాణ్ మండపంలో నూతన జంట పుష్అప్స్

సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో

Pushups : వైరల్ వీడియో.. కళ్యాణ్ మండపంలో నూతన జంట పుష్అప్స్

Pushups

Bride And Bride Groom Pushups : సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా ఓ పెళ్లి మండపంలో వధూవరులు చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వారిద్దరూ ఏం చేశారో తెలుసా? పుష్ అప్స్ చేశారు. పెళ్లికొచ్చిన గెస్టులను విస్మయానికి గురి చేశారు. ఇంతకీ ఈ నూతన జంట ప్రత్యేకించి పుష్ అప్స్ చేయడానికి కారణం లేకపోలేదు. వారిద్దరూ ఫిట్ నెస్ కోచ్ లు మరి.

పెళ్లి కొడుకు పేరు ఆదిత్య మ‌హ‌జ‌న్. పెళ్లి కూతురు అక్షిత అరోరా మ‌హ‌జ‌న్‌. ఇద్ద‌రూ ఫిట్‌నెస్ కోచ్‌లు. అందుకే.. వృత్తిని ఒక‌సారి పెళ్లిమండపం మీద గుర్తుకు తెచ్చుకొని.. ఇలా ఇద్ద‌రూ పుష్అప్స్ తీశారు. పెళ్లి కూతురు అయితే 8 కిలోల బ‌రువు ఉన్న లెహంగాను వేసుకొని మ‌రీ.. పుష్అప్స్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో వైర‌ల్ బ‌చ్‌ప‌న్ కా ప్యార్ అనే సాంగ్ మ్యూజిక్ యాడ్ చేసి ఆ వీడియోను పెళ్లికూతురు అక్షిత త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

వాళ్లకు ఫిట్‌నెస్‌పై ఉన్న ఆస‌క్తిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంత భారీ లెహంగా వేసుకొని.. పెళ్లి కూతురు పుష్అప్స్ చేయ‌డం మామూలు విష‌యం కాద‌ని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akshita Arora Mahajan | Coach (@fit.arora)