Devotee Stuck Under Statue : అయ్యో భయ్యా.. అక్కడేం పని నీకు.. గుడిలో విగ్రహం కిందకి వెళ్లి ఇరుక్కుపోయిన భక్తుడు.. వీడియో వైరల్

దేవుడిని మొక్కుకునేందుకు ఆలయానికి వెళ్లిన అతడికి.. పెద్ద కష్టమే వచ్చి పడింది. గుడిలో ఓ విగ్రహం కింద ఇరుక్కుపోయాడు. అటు రాలేక, ఇటు పోలేక.. పాపం.. నానా తంటాలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Devotee Stuck Under Statue : అయ్యో భయ్యా.. అక్కడేం పని నీకు.. గుడిలో విగ్రహం కిందకి వెళ్లి ఇరుక్కుపోయిన భక్తుడు.. వీడియో వైరల్

Updated On : December 6, 2022 / 12:36 AM IST

Devotee Stuck Under Statue : మన కష్టాలన్నీ పోవాలని, బాధలన్నీ తీరిపోవాలని దేవుడిని వేడుకునేందుకు గుడికి వెళ్తాం. కానీ, ఆ గుడిలోనే మనకు కష్టం ఎదురైతే, ఇబ్బందుల్లో పడితే. అంతకుమించిన ట్రాజెడీ మరొకటి ఉండదనే చెప్పాలి. ఆ భక్తుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. దేవుడిని మొక్కుకునేందుకు ఆలయానికి వెళ్లిన అతడికి.. పెద్ద కష్టమే వచ్చి పడింది. గుడిలో ఓ విగ్రహం కింద ఇరుక్కుపోయాడు. అటు రాలేక, ఇటు పోలేక.. పాపం.. నానా తంటాలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గుజరాత్‌లో ఓ వ్యక్తి ఆలయానికి వెళ్లాడు. ఆ గుడిలో ఏనుగు విగ్రహం ఉంది. ఆ గుడికి వచ్చే భక్తులు.. ఆ ఏనుగు విగ్రహం కింద నుంచి పడుకుని బయటకు వస్తుంటారు. అలా చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. దీంతో ఆ వ్యక్తి కూడా అలాగే చేశాడు.

Boring Job : వీడెవడండీ బాబూ.. నెలకు రూ.8లక్షల జీతం.. అయినా జాబ్ బోరింగ్‌గా ఉందని కంపెనీపై కేసు

ఏనుగు విగ్రహం కిందకు వెళ్లాడు. కానీ ఊహించని విధంగా ఇరుక్కుపోయాడు. అటు రాలేక ఇటు వెళ్లలేక నానా అవస్థలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. విగ్రహం కింద చిక్కుకుపోయిన ఆ వ్యక్తి బయటపడలేక ఇబ్బంది పడుతున్న దృశ్యం వీడియోలో ఉంది. ఆ సమయంలో అక్కడ చుట్టూ చేరిన జనం.. అతడు బయటకొచ్చేందుకు సలహాలు, సూచనలు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే ఆ వీడియో పూర్తిగా లేదు. చివరికి.. అతను బయటకి వచ్చాడా? లేదా? అన్నది అందులో లేదు. మొత్తం ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అయ్యింది. అతడి బాధను చూడలేక కొందరు అయ్యో పాపం అంటే, మరీ కామెడీగా ఉందంటూ మరికొందరు నవ్వుకుంటున్నారు. భయ్యా.. ఈ ఏజ్ లో నీకు ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని ఇంకొందరు అడిగారు.