Boring Job : వీడెవడండీ బాబూ.. నెలకు రూ.8లక్షల జీతం.. అయినా జాబ్ బోరింగ్‌గా ఉందని కంపెనీపై కేసు

తనకు ఏ పనీ లేని ఉద్యోగం ఇచ్చారని కోర్టుని ఆశ్రయించాడు. వారంలో ఒక్క రోజు కూడా చేసేందుకు పని లేదని, జాబ్ చాలా బోరింగ్ ఉందంటూ.. అతగాడు కంపెనీపై కేసు వేశాడు.

Boring Job : వీడెవడండీ బాబూ.. నెలకు రూ.8లక్షల జీతం.. అయినా జాబ్ బోరింగ్‌గా ఉందని కంపెనీపై కేసు

Boring Job : ఇదో వింత కేసు.. ఇప్పటివరకు కనీవిని ఎరిగి ఉండరు కాబోలు. అది నెలకు రూ.8లక్షలు జీతం వచ్చే జాబ్. నెలకు 8లక్షల రూపాయల శాలరీ అంటే మామూలు విషయం కాదు కదా. నెలకు లక్షల్లో జీతం వచ్చే జాబ్ అంటే.. ఎగిరి గంతేస్తారు. అంత జీతం వచ్చే జాబ్ ని వదులుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు చెప్పండి. కానీ, అతడా పని చేశాడు. నాకీ జాబ్ వద్దు అని చెప్పాడు. అంతేనా.. జాబ్ చాలా బోరింగ్ గా ఉందంటూ.. ఏకంగా యజమానిపై కోర్టులో కేసు కూడా పెట్టాడు. ఈ షాకింగ్ ఘటన ఐర్లాండ్ లో జరిగింది.

సాధారణంగా.. తమకు ఇచ్చే జీతం కంటే ఎక్కువ పని చేయించుకుంటున్నారని ఉద్యోగులు బాధపడుతుంటారు. ఇచ్చేది తక్కువ చేయించుకునేది ఎక్కువ అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇది చాలా కామన్. ఇందులో పెద్ద వింతేమీ లేదు.

Also Read.. Transgender In UK : యూకేలో లింగమార్పిడికి పెరిగిన డిమాండ్.. పురుషులుగా మారాలనుకుంటున్న స్త్రీలు

కానీ, ఐర్లాండ్ లో ఓ వ్యక్తి తనకు ఏ పనీ లేని ఉద్యోగం ఇచ్చారని కోర్టుని ఆశ్రయించాడు. డబ్లిన్ లోని ఐరిష్ రైల్వేలో ఫైనాన్స్ మేనేజర్ గా పని చేస్తున్న డెర్మోట్ అలెస్టర్ మిల్స్.. నెలకు రూ.8లక్షలు జీతం తీసుకుంటున్నాడు. అయితే వారంలో ఒక్క రోజు కూడా చేసేందుకు పని లేదని, జాబ్ చాలా బోరింగ్ ఉందంటూ.. అతగాడు కంపెనీపై కేసు వేశాడు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఉద్యోగం దొరకడమే కష్టమైపోయిన ఈ రోజుల్లో.. నెలకు రూ.8లక్షలు వచ్చే జాబ్ ని వద్దని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందంటున్నారు నెటిజన్లు. వీడెవడండీ బాబూ అని తల పట్టుకుంటున్నారు.

తినడం, తాగడం, న్యూస్ పేపర్లు చదవడం తప్ప మరేమీ పని లేకుండా పోయిందన్నది మిల్స్ ఆవేదన. కనీసం వారానికి ఒక రోజైనా చేయడానికి ఏదో ఒక పని ఉండి ఉంటే చాలా థ్రిల్‌గా ఉండేదన్నాడు. ప్రస్తుతం తనకు ఏ పనీ లేని కారణంగా.. తన సహోద్యోగుల నుండి తనను ఒంటరి చేసిందని వాపోయాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”నేను ఉదయం 10 గంటలకు ఆఫీసుకి వెళ్తాను. రెండు వార్తా పత్రికలు, ఒక శాండ్‌విచ్ కొనుగోలు చేస్తాను. నేను నా కేబిన్ లోకి వెళ్తాను. నా కంప్యూటర్‌ ఆన్ చేస్తాను, ఈ-మెయిల్‌ చూస్తాను. అందులో పనికి సంబంధించిన ఒక్క మెయిల్ కానీ, మేసేజ్ లు కానీ, కమ్యూనికేషన్‌ కానీ లేవు. కనీసం సహోద్యోగి కమ్యూనికేషన్‌ కూడా లేదు. నేను కూర్చుని వార్తాపత్రిక చదువుతాను. నా శాండ్విచ్ తింటాను. ఉదయం 10.30 గంటలకు, సమాధానం అవసరమైన ఇమెయిల్ ఉంటే, నేను దానికి సమాధానం ఇస్తాను” అని మిల్స్ చెప్పుకొచ్చాడు.

కాగా.. ఈరోజుల్లో ఉద్యోగం దొరకడమే కష్టం. ఇక శాలరీ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏదో ఒక జాబు, ఎంతో కొంత జీతం కరెక్ట్ గా ఇస్తే అదే చాలు అన్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది నెలకు రూ.8లక్షల జీతం వచ్చే జాబ్ అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. కానీ, మిల్స్ చేసిన చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.