3 గంటల వరకు : నమోదైన పోలింగ్ శాతం ఇదే

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 10:45 AM IST
3 గంటల వరకు : నమోదైన పోలింగ్ శాతం ఇదే

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్ గఢ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, మణీపూర్, మిజోరం, మేఘాలయ, ఒడిషా, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ ద్వీపం, లక్ష్యదీప్ రాష్ట్రాల్లో గురువారం (ఏప్రిల్ 11, 2019) ఉదయం 6 గంటల నుంచి ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు పశ్చిమ బెంగాల్ లో భారీ స్థాయిలో (69.94%) పోలింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత మణిపూర్ లో 68.90 శాతం నమోదు కాగా, నాగాలాండ్ లో 68 శాతం, త్రిపుర పశ్చిమ పార్లమెంటరీ నియోజకవర్గంలో 68.65 శాతం నమోదైంది. మిజోరంలో 55.20 శాతం నమోదు కాగా, అస్సాంలో 59.5 శాతం, జమ్మూకశ్మీర్ లో మొత్తం ఓటింగ్ శాతం 46.17 శాతం నమోదు కాగా, జమ్మూలో 59.0 శాతం, సాంబాలో 66.6 శాతం, రాజోరిలో 58.4 శాతం, పూంచ్ లో 53.4 శాతం నమోదైంది. 

ఆంధ్రప్రదేశ్ లో 55 శాతం, తెలంగాణలో 48.95 శాతం, అరుణాచల్ ప్రదేశ్ 50.87 శాతం, సిక్కింలో 55 శాతం నమోదైంది. బరముల్ల నియోజకవర్గంలో మూడు గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం వరుసగా.. బారముల్లలో 19.0 శాతం, కుప్వారాలో 38.7 శాతం, బందిపొరాలో 26.1 శాతం వరకు నమోదైంది. బీహార్ లోని ఔరంగాబాద్ లో 38.50 శాతం, గయాలో 44 శాతం, నవాడాలో 43 శాతం, జుమాయిలో  41.34 శాతం నమోదైంది.  నాగలాండ్ పార్లమెంటరీ నియోజవర్గంలో 21 శాతం వరకు అత్యధిక స్థాయిలో ఓటింగ్ నమోదైంది. లక్ష్యదీప్ లో 9.83 శాతం నమోదు కాగా, అండమాన్ నికోబార్ దీవుల్లో 5.83 శాతం వరకు నమోదైంది.

అస్సాంలో 10.2 శాతం, అరుణాచల్ ప్రదేశ్ లో, తెలంగాణలో 10.6 శాతం,  13.3 శాతం, షాహరాన్ పూర్ లో 8 శాతం, కైరానాలో 10 శాతం, ముజప్ఫర్ నగర్ లో 10 శాతం, మీరట్ లో 10 శాతం, బిజ్ నార్ లో 11శాతం, ఘాజియాబాద్ లో 11 శాతం, గౌతమ్ బుద్ధ్ నగర్ లో 12 శాతం వరకు ఓటింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్ లో 50.86 శాతం,  మేఘాలయలో 55 శాతం, నాగపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 38.35 శాతం, లక్ష్యదీప్ లో 51.25 శాతం, ఉత్తరాఖండ్ లో 46.59 శాతం పోలింగ్ నమోదైంది. 

మహారాష్ట్రలో మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన మొత్తం పోలింగ్ శాతం మహారాష్ట్రలో  46.13 శాతం కాగా, నియోకవర్గాలవారీగా వార్దాలో 43.90 శాతం, రామ్ టెక్ (ఎస్సీ) 44.50 శాతం, నాగపూర్ లో 41.25 శాతం, భండారా-గోండ్యా లో 49.05 శాతం, గడ్చిరోలి-చిమూర్ (ఎస్టీ) 57.00 శాతం, చందర్ పూర్ లో 46.30 శాతం, యవత్మాల్-వాషిమ్ 43.35 శాతంగా ఓటింగ్ నమోదైంది.