WE ARE 162 : మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

  • Published By: madhu ,Published On : November 25, 2019 / 02:57 PM IST
WE ARE 162 : మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

మహారాష్ట్రలో హై డ్రామా నెలకొంది. WE ARE 162 అంటున్నాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు. గ్రాండ్ హయత్ హోటల్లో 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు బలప్రదర్శన చేశాయి. మూడు పార్టీలతో పాటు మిత్రపక్షాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. లాంగ్ లివ్ మహా వికాస్ అఘాడీ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారు. 

తమ పోరాటం అధికారం కోసం కాదు..సత్యం కోసం అన్నారు శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే. బలపరీక్షలో ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. తమ పార్టీలో చీలిక తెచ్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కలిసిపని చేద్దామని పిలుపునిచ్చారు. 

అజిత్ పవార్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని, బలం లేకుండా..బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. కర్నాటక, గోవా, మణిపూర్‌లలో ఇదే తరహా..డ్రామాలాడారని వివరించారు. తమకు సంఖ్యా బలం ఉందని స్పష్టం చేసిన పవార్..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అక్రమంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని విమర్శించారు. 
Read More : బాంబులతో జనాన్ని ఒకేసారి చంపేయండి : కాలుష్యంపై ప్రభుత్వాలకు సుప్రీం చివాట్లు

తమకు 162మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని కోరారు. కోర్టుకు ముందే జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. మరి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారా లేదా అనేది చూడాలి.