దేశంలో కొత్తగా : శుభలేఖల్లో పుట్టిన తేదీలు

  • Published By: venkaiahnaidu ,Published On : April 25, 2019 / 06:21 AM IST
దేశంలో కొత్తగా : శుభలేఖల్లో పుట్టిన తేదీలు

 బాల్య వివాహాలను అరికట్టేందుకు రాజస్థాన్ రాష్ట్రంలోని బుండి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. శుభలేఖలలో తప్పనిసరిగా వరుడు,వధువు పుట్టిన తేదీలను పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా బాల్య విహాలు నేరం అంటూ  శుభలేఖలలో ముద్రించాలని బుండి జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో జరుగతున్న వెడ్డింగ్ ప్రిపరేషన్స్,పెళ్లిళ్ల కోసం బుక్ చేసుకునే వాహనాలను,పూజారులపై,చిన్నారుల అరచేతులపై హెన్నా వంటి వాటిపై ఓ కన్నేసి ఉంచాలని స్కూల్ ప్రిన్సిపల్స్, ల్యాండ్ రికార్డ్ ఇన్స్ పెక్టర్,గ్రామ్ సేవక్,అంగన్ వాడీ వర్కర్స్ తో టీమ్ లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది.

అంతేకాకుండా స్కూల్స్ లో చిన్నారుల హాజరుపై కూడా తనిఖీలు చేయాలని టీమ్స్ ని ఆదేశించింది.తమ తమ ఏరియాల్లో ఆయా టీమ్స్ తనిఖీలు చేయనున్నారు. బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ చేయాలని ఎవరైనా వస్తే తప్పనిసరిగా వాళ్ల దగ్గర నుంచి వధువు,వరుడి బర్త్ సర్టిఫికెట్స్  తీసుకోవాలని,బాల్య వివాహాలు నేరం అనే హెచ్చరికతో శుభలేఖలలో వారి పుట్టిన తేదీలను ప్రింట్ చేయాలని ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది.

మే-7,2019న అక్షయ్ తృతియ ఫెస్టివల్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ లోని చాలా మంది చిన్నారులకు అక్షయ తృతియ రోజున 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తుంటారు.దశాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.