Nitish Kumar: ‘కొత్త జాతి పిత’ దేశం కోసం ఏం చేశాడు? మోదీపై నితీష్ కుమార్ విమర్శలు

దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోదీని.. నవ భారతానికి.. కొత్త జాతిపితగా ఆమె అభివర్ణించింది. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు గాంధీ అయితే, ఇప్పటి దేశానికి మాత్రం మోదీ జాతి పిత అని ఆమె అభివర్ణించారు.

Nitish Kumar: ‘కొత్త జాతి పిత’ దేశం కోసం ఏం చేశాడు? మోదీపై నితీష్ కుమార్ విమర్శలు

Nitish Kumar: ‘కొత్త జాతి పిత’ అని పిలిపించుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు బిహార్ సీఎం నితీష్ కుమార్. శనివారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీపై నితీష్ విమర్శలు గుప్పించారు. ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

Ayodhya: నేడు అయోధ్యకు 50 లక్షల మంది భక్తుల రాక.. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు

మోదీని.. నవ భారతానికి.. కొత్త జాతిపితగా ఆమె అభివర్ణించింది. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు గాంధీ అయితే, ఇప్పటి దేశానికి మాత్రం మోదీ జాతి పిత అని ఆమె అభివర్ణించారు. మోదీని మరో జాతిపితగా పేర్కొనడంపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా నితీష్ కుమార్ కూడా ఈ అంశంలో ప్రధానిపై విమర్శలు చేశారు. ‘‘వాళ్లు (బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను ఉద్దేశించి) స్వాతంత్ర పోరాటంలో చేసిందేమీ లేదు. స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదు. వాళ్లు మాత్రం కొత్త దేశానికి.. కొత్త జాతిపితగా చెప్పుకొంటారు. కొత్త జాతి పిత దేశానికేం చేశారు?’’ అని నితీష్ కుమార్ ప్రశ్నించారు.

North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్

మరోవైపు అమృత వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ కూడా విమర్శలు చేశారు. మహాత్మా గాంధీతో పోల్చగలిగే స్థాయి ఎవరికీ లేదన్నారు. ‘‘బీజేపీ నేతల దృష్టిలో కొత్త భారత దేశం అంటే వాళ్ల సన్నిహితుల్ని మాత్రమే ధనవంతుల్ని చేయడం. మిగతా ప్రజల్ని పేదరికంలో, ఆకలిలో ముంచడం. మనకు ఇలాంటి నవ భారతం అక్కర్లేదు’’ అని పటోల్ విమర్శించారు.