Mask At Home : ఇంట్లో ఉన్నా మాస్క్‌ మస్ట్… ఎందుకంటే…

ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్‌లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా కరోనా వైరస్‌ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్‌ ధరించాలని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఇంట్లో ఉన్నప్పుడూ మాస్క్‌ ధరించాలని కేంద్రం కోరుతోంది. ఇంట్లో ఇతరులతో కలిసి కూర్చున్నప్పుడు మాస్క్‌ ధరిస్తే వైరస్‌ వ్యాప్తి చెందదని

Mask At Home : ఇంట్లో ఉన్నా మాస్క్‌ మస్ట్… ఎందుకంటే…

Mask At Home

Wear Mask At Home : ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్‌లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా కరోనా వైరస్‌ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్‌ ధరించాలని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఇంట్లో ఉన్నప్పుడూ మాస్క్‌ ధరించాలని కేంద్రం కోరుతోంది. ఇంట్లో ఇతరులతో కలిసి కూర్చున్నప్పుడు మాస్క్‌ ధరిస్తే వైరస్‌ వ్యాప్తి చెందదని చెప్పింది. ఇంటికి గెస్టులను ఆహ్వానించ వద్దంది. పాజిటివ్‌గా తేలిన వారు ఆస్పత్రుల్లోనే చేరాల్సిన అవసరం లేదని, వారిని వేరుగా గదిలో ఉంచవచ్చంది. వారి ద్వారా ఇతర కుటుంబసభ్యులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలంది. ఇంట్లో వసతులు లేకుంటే ఐసోలేషన్‌ కేంద్రాలకు వెళ్లవచ్చని సూచించింది.

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌పై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలు పారదోలేందుకు, అప్రమత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇళ్లలోనే ఉండి, ఇంట్లోనూ మాస్క్‌ ధరించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలను కోరింది. కేసుల తీవ్రత గురించి ఎలాంటి భయానికి గురి కావద్దని తెలిపింది. అనవసర ఆందోళనతో మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందంది. దేశంలో అవసరానికి సరిపోను ఆక్సిజన్‌ నిల్వలున్నాయని, రవాణాలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు వివరించింది.

కరోనా బాధితుల్లో ఎక్కువమంది ఇంట్లో ఉండే చికిత్స పొందవచ్చని, డాక్టర్లు సూచిస్తేనే ఆస్పత్రుల్లో చేరాలని కేంద్రం తెలిపింది. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో రెమిడెసివిర్, తోసిలిజుమాబ్‌ వంటి ముఖ్యమైన ఔషధాల వినియోగానికి సరైన ప్రిస్క్రిప్షన్‌ అవసరమని ఆరోగ్య శాఖ తెలిపింది. రెమిడెసివిర్, తోసిలిజుమాబ్‌ మాదిరిగా ప్రభావం చూపే చౌకైన, తేలిగ్గా అందుబాటులో మందులు చాలానే ఉన్నాయని, వాటిని వాడటం మంచిదని చెప్పింది. మెడికల్ ఆక్సిజన్‌ దేశంలో వైద్య వినియోగానికి తగినంత ఉన్నప్పటికీ, దానిని ఆసుపత్రులకు రవాణా చేయడం సవాలుగా మారిందని చెప్పింది. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లకు, ఆక్సిజన్‌ డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు దూరం ఎక్కువగా ఉందని తెలిపింది. న్యాయమైన పద్ధతిలో ఆక్సిజన్‌ వాడాలని, దాని వృథాను ఆపాలని కేంద్రం రాష్ట్రాలు, ఆసుపత్రుల యాజమాన్యాలను కేంద్రం కోరింది.

ఒక్కో బాధితుడి నుంచి 406 మందికి కరోనా..
గత ఏడాది(2020) మొదటి వేవ్‌తో పోలిస్తే ఈసారి వ్యాప్తి చాలా రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో గత ఏడాది కంటే 2.25 రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో, కర్ణాటకలో 3.3 రెట్లు, ఉత్తరప్రదేశ్‌లో 5 రెట్లు ఎక్కువగా కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. భౌతిక దూరం పాటించకుంటే ఒక్కో బాధితుడి ద్వారా 30 రోజుల్లో 406 మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలిందని డాక్టర్‌ పాల్‌ తెలిపారు. భౌతికదూరం 50% పాటించినట్లయితే, ఒక్కో వ్యక్తి ద్వారా 15 మందికి మాత్రమే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు రుజువైంది. భౌతిక దూరాన్ని 75% పాటించిన బాధితుడి ద్వారా 30 రోజుల్లో 2.5 మందికే వైరస్‌ సోకుతుంది. వ్యాక్సినేషన్‌కు, మహిళల పీరియడ్స్‌కు సంబంధం లేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.

మందులు, ఆవిరితోనే కరోనా తగ్గించవచ్చు:
కొత్త వ్యాక్సినేషన్‌ విధానం అమల్లోకి వచ్చింది. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉందంటూ ఎక్కువ మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో 90 శాతం మందికి జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి వాటితో స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. వీరికి జ్వరానికి ఇచ్చే మందులు, ఆవిరి పట్టడంతో వ్యాధిని తగ్గించవచ్చు. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత ఆక్సిజన్‌ సంతృప్తికర స్థాయిలో ఉండి, స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో జాయినవ్వాలని కోరుకుంటున్నారు.

అప్పుడు మాత్రమే ఆక్సిజన్ అవసరం:
మధ్యస్త, తీవ్ర స్థాయి కేసుల్లో 5వ రోజు నుంచి 7వ రోజు తర్వాత మాత్రమే ఆక్సిజన్‌తో అవసరం ఉంటుంది. అంతకంటే ముందుగా ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మొదటి, రెండో రోజే చికిత్స సమయంలో ఆక్సిజన్‌ అందిస్తే సైడ్‌ ఎఫెక్ట్స్ తలెత్తే ప్రమాదం ఉంది. కోవిడ్‌ బాధితులకు అందజేసే రెమిడెసివిర్, టొసిలిజుమాబ్‌ వంటి ఔషధాలను హేతుబద్ధంగా ఆస్పత్రులు వాడాలి. పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లపై రెమిడెసివిర్‌ ప్రభావం ఇంకా నిర్థారణ కానందున, బదులుగా వేరే మందులను వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది.