Kalyani Railway Station : మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తి.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికురాలు

కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో పట్టుకోల్పోయి ఓ మహిళ రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యలో పడబోయింది. ఇంతలోనే అక్కడున్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ పరుగున వచ్చి మహిళను రక్షించింది.

Kalyani Railway Station : మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తి.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికురాలు

Kalyani Railway Station

Kalyani Railway Station :  కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో పట్టుకోల్పోయి ఓ మహిళ రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యలో పడబోయింది. ఇంతలోనే అక్కడున్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ పరుగున వచ్చి మహిళను రక్షించింది. ఈ ఘటన ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల మహిళ లోకల్ రైలు ఎక్కేందుకు కళ్యాణ్ రైల్వే స్టేషన్ కి వచ్చింది. ఆమె ప్లాట్‌ఫామ్ పైకి వచ్చే సరికి రైలు కదలడం ప్రారంభించింది.

చదవండి : Train : పట్టాలపై ఆగిపోయిన రైలు.. కూలీలతో తోయించిన అధికారులు

ఈ సమయంలోనే రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. పట్టుకోల్పోవడంతో రైలు ప్లాట్‌ఫామ్ మధ్య పడబోయింది.. వెంటకనే అక్కడున్న ఆర్పీఎస్ మహిళ కానిస్టేబుల్ ఆమెను రక్షించారు. ఇందుకు సంబందించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కాగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లు రైల్వే కానిస్టేబుల్‌ను మెచ్చుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి మహిళ ప్రాణాలు కాపాడారంటూ ప్రశంశలు కురిపిస్తున్నారు.

చదవండి : Gang Rape In Train : రైలులో ప్రయాణికురాలిపై దోపిడీ దొంగల సామూహిక అత్యాచారం

ఇదే రైల్వేస్ స్టేషన్‌లో నాలుగు రోజుల క్రితం ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. గర్భిణీ కదులుతున్న రైల్లోంచి దిగుతుండగా పట్టుతప్పి కిందపడిపోయింది. ఈమె రైలుకు ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో పడిపోతుండగా రైల్వే కానిస్టేబుల్ ఆమెను రక్షించాడు. ఆ వీడియో కూడా తాజాగా వైరల్‌గా మారింది. ఇక తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతుండటంతో స్టేషన్‌లో హెచ్చరిక బోర్డులతోపాటు.. అన్నౌన్స్ మెంట్స్ చేస్తున్నారు.

చదవండి : Bullet Train : హైదరాబాద్ టు ముంబై బుల్లెట్‌ ట్రైన్.. మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు!

రైలు కదులుతున్న సమయంలో ఎక్కకూడదని సూచిస్తున్నారు. అయినా కొందరు ప్రయాణికులు మాత్రం రైల్వే అధికారుల సూచనలు పట్టించుకోకుండానే కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదానికి గురవుతున్నారు.