Uttar Pradesh: పని మనిషిపై మహిళ దాడి.. లిఫ్టులోని సీసీ కెమెరాలో రికార్డైన ఘటన

క్లియో కౌంటీ సొసైటీలో ఉంటున్న షెఫాలీ కౌల్ అనే మహిళ ఇంట్లో అనిత అనే 20 ఏళ్ల యువతి పని చేస్తుండేది. ఈ క్రమంలో షెఫాలీ ఆమెను వేధింపులకు గురి చేసింది. దీంతో ఆమె పనికి నిరాకరిచింది. తాజాగా తన ఇంట్లో పని చేసేందుకు రమ్మని అనితను కోరింది షెఫాలి.

Uttar Pradesh: పని మనిషిపై మహిళ దాడి.. లిఫ్టులోని సీసీ కెమెరాలో రికార్డైన ఘటన

Uttar Pradesh: తన ఇంట్లో పని చేసే మహిళపై యజమానురాలు దాడి చేసి, విచక్షణారహితంగా ప్రవర్తించింది. ఈ ఘటన అక్కడి లిఫ్ట్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఉత్తర ప్రదేశ్, నోయిడాలో ఉన్న క్లియో కౌంటీ సొసైటీలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Tamil Nadu: చైనా నుంచి తమిళనాడు వచ్చిన తల్లీకూతురుకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు

క్లియో కౌంటీ సొసైటీలో ఉంటున్న షెఫాలీ కౌల్ అనే మహిళ ఇంట్లో అనిత అనే 20 ఏళ్ల యువతి పని చేస్తుండేది. ఈ క్రమంలో షెఫాలీ ఆమెను వేధింపులకు గురి చేసింది. దీంతో ఆమె పనికి నిరాకరిచింది. తాజాగా తన ఇంట్లో పని చేసేందుకు రమ్మని అనితను కోరింది షెఫాలి. దీనికి అనిత నిరాకరించడంతో ఆమెపై దాడి చేసింది. అనిత తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నిచింది. ఆమె ఎంతగా వద్దని వేడుకుంటున్నా, తన ఇంట్లో పని చేయాల్సిందే అంటూ తీసుకెళ్లింది. ఆమెపై దాడి చేసి, ఈడ్చుకెళ్లింది.

ఈ ఘటన సొసైటీలో ఉన్న లిఫ్ట్‌లోని సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షెఫాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. తన కూతురుపై దాడి చేసిన షెఫాలిపై చర్యలు తీసుకోవాలని అనిత తండ్రి పోలీసుల్ని కోరాడు.