UP: యోగి ఆదిత్యనాథ్ గుడికి తాళం వేసిన అధికారులు.. ఎందుకో తెలుసా?

ఈ ఏడాది జూలైలో కల్యాణ్ భదర్సా గ్రామానికి చెందిన ప్రభాకర్ మౌర్య ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆదిత్యనాథ్ ప్రచారకర్తగా చెప్పుకునే మౌర్య తన ఇష్టదైవం యోగి అని ప్రకటించుకున్నాడు. అలాగే యోగిపై పలు పాటలు కూడా రికార్డు చేశాడు. గుడి నిర్మాణ విషయం సెప్టెంబర్ 21న వెలుగులోకి వచ్చింది. మౌర్య ఆలయ నిర్మాణం కోసం భూమిని ఆక్రమించినట్టు ఫిర్యాదు రావడంతో అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. మౌర్యపై అతడి మేనమామ రామ్‌నాథ్ నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశాడు

UP: యోగి ఆదిత్యనాథ్ గుడికి తాళం వేసిన అధికారులు.. ఎందుకో తెలుసా?

Yogi Adityanath temple on government land locked by officials

UP: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‭కు ఈ మధ్యే ఒక వ్యక్తి గుడి కట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ గుడికి తాజాగా అధికారులు తాళం వేశారు. ప్రభుత్వ స్థలంలో గుడిని నిర్మించారని తేలడంతో జిల్లా అధికార యంత్రాంగం స్పందించి తాళం వేసింది. కాగా, అధికారుల తీరుపై గుడి నిర్మించిన మౌర్య అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను భగవంతుడిగా భావించే వ్యక్తిని ఆరాధించడం కొందరికి గిట్టటం లేదని, అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని, ఇది అనుచితమని మౌర్య అన్నాడు. యోగి ఆదిత్యనాథ్ వేలాది అభిమానులు తనకు మద్దతుగా ఉన్నారని, వారంతా అయోధ్యకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అతడు తెలిపాడు.

ఈ ఏడాది జూలైలో కల్యాణ్ భదర్సా గ్రామానికి చెందిన ప్రభాకర్ మౌర్య ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆదిత్యనాథ్ ప్రచారకర్తగా చెప్పుకునే మౌర్య తన ఇష్టదైవం యోగి అని ప్రకటించుకున్నాడు. అలాగే యోగిపై పలు పాటలు కూడా రికార్డు చేశాడు. గుడి నిర్మాణ విషయం సెప్టెంబర్ 21న వెలుగులోకి వచ్చింది. మౌర్య ఆలయ నిర్మాణం కోసం భూమిని ఆక్రమించినట్టు ఫిర్యాదు రావడంతో అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. మౌర్యపై అతడి మేనమామ రామ్‌నాథ్ నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశాడు. మామిడి చెట్లు ఉన్న చోట తన మేనల్లుడు ఆలయం కట్టాడని, ఎలాంటి అనుమతి లేకుండా చెట్టు కొమ్మలు కత్తిరించాడని, ఆక్రమించుకున్న భూమిలో నిర్మాణ జరిగిందని ఆ ఫిర్యాదులో రామ్‌నాథ్ పేర్కొన్నాడు.

రామ్‌నాథ్ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం.. భూమి ప్రభుత్వానికి చెందినదని విచారణ ద్వారా తేల్చింది. దీంతో గుడికి తాళం వేసింది. కాగా, భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో మౌర్య నేరుగా స్పందించనప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన ట్వీట్‌కు మాత్రం ఘాటుగా స్పందించాడు. అఖిలేష్ యాదవ్ హయాంలో యాదవులు తమ గ్రామంలోనూ, పరిసరాల్లోనూ అక్రమంగా భూములు స్వాధీనం చేసుకున్నారని, ఆ భూములను విముక్తిపై అఖిలేష్ దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించాడు.

BJP Chief: ఎన్నికలకు దూరంగా బీజేపీ.. 2024 వరకు నడ్డానే కమలం బాస్