UP Govt : మంత్రివర్గ లిస్టుతో హస్తినలో యోగి.. ఎవరికి దక్కేనో ఛాన్స్!

గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి ఈ సారి చోటు దక్కదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ఓడిపోయిన వారిలో...

UP Govt : మంత్రివర్గ లిస్టుతో హస్తినలో యోగి.. ఎవరికి దక్కేనో ఛాన్స్!

Yogi And Modi

Yogi in Delhi : యూపీలో రెండోసారి రికార్డ్ విజయం సాధించారు. ఇక నెక్స్ట్‌ ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ పెద్దలను కలిసి చర్చిస్తున్నారు యోగి. రెండు రోజుల పాటు హస్తినలో మంతనాలు జరపనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ను కలవనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తేదీ, నూతన మంత్రి వర్గ కూర్పుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్నారు యోగి. హోళీ తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం.

Read More : UP Election Results : యోగీ ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరు? యూపీ బీజేపీలో పెద్ద ప్రశ్న ఇదే..!

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో యోగి ఫుల్ జోష్‌లో ఉన్నారు. మొత్తం 255 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది బీజేపీ. 37 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు యోగి. అయితే ఈ సారి మంత్రివర్గ కూర్పుపై ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కొంతమంది ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. మరికొంతమంది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరోవైపు ఈ సారి భారీగా ఆశావహులు ఉన్నారు. దీంతో మంత్రి వర్గ కూర్పు కష్టతరంగా మారింది.

Read More : Uttar Pradesh 2022 : యూపీ నా అడ్డా అంటున్న యోగీ.. మెజార్టీకి 15 పాయింట్స్

గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి ఈ సారి చోటు దక్కదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ఓడిపోయిన వారిలో గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్యకు మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది అధిష్టానం. అలాగే యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్ సింగ్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా వ్యవహిరించిన బేబీరాణి మౌర్యకు మంత్రి పదవులు దక్కుతాయని చర్చ జరుగుతోంది. మంత్రివర్గానికి సంబంధించిన లిస్టుతో ఢిల్లీ వెళ్లిన యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పెద్దలతో చర్చించి ఫైనల్ చేయనున్నారు.