Maoist : మావోయిస్టుల చేతిలో యువకుడు దారుణ హత్య

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇంఫార్మర్ అనే నేపంతో దినేష్ నూరేటి అనే యువకుడిని అతి కిరాతకంగా హత్యచేశారు.

10TV Telugu News

Maoist :  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇంఫార్మర్ అనే నేపంతో దినేష్ నూరేటి అనే యువకుడిని అతి కిరాతకంగా హత్యచేశారు. గురువారం కాంకేర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మూడు గ్రామాల ప్రజలను కూడగట్టి ప్రజాకోర్టును ఏర్పాటు చేశారు మావోసుతులు. ఇక్కడే పలువురు యువకులకు వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు.

చదవండి : Maoists posters: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

ఇదే సమయంలో దినేష్ నూరేటి అనే యువకుడిని ప్రజల మద్యంలో నిలబెట్టి అతడు తప్పు చేశాడని.. తమ వ్యవహారాలను పోలీసులకు అందిస్తున్నాడని.. అందుకు సంబందించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతూ అతడిని కాల్చి చంపారు. ఈ విషయాన్నీ కాంకేర్ జిల్లా పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ప్రజాకోర్టులో సుమారు 40 మంది మావోయిస్టులు పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

చదవండి : Fake Maoists Arrested : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్

×