Sanjay Raut: సీబీఐ, ఈడీలను తాలిబన్లతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్

నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. కేంద్ర సంస్థలపై భారత ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందన్నారు

Sanjay Raut: సీబీఐ, ఈడీలను తాలిబన్లతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్

Centre using ED & CBI like Taliban & Al Qaeda pick weapons says Sanjay Raut

Sanjay Raut: సూటిగా, ఘాటుగా పదునైన వ్యాఖ్యలు చేసే శివసేన (ఉద్ధవ్ వర్గం) సీనియర్ నేత సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్థల్ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. అంతే కాకుండా తాలిబన్లు, ఆల్ ఖైదా ఎలాగైతే ఆయుధాల్ని ఉపయోగించి తమ వ్యతిరేకుల్ని మట్టుబెట్టాలని చూస్తాయో.. సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం అలాగే వాడుకుంటోందని ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.

Uddhav Thackeray: గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా..? ఆర్ఎస్‌ఎస్, బీజేపీపై ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం

లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడంపై తొమ్మిది విపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వానికి ఆదివారం లేఖ రాశారు. అందులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, నియంతృత్వం పెరిగి పోయిందంటూ విమర్శలు గుప్పించారు. ఈ లేఖపై సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘‘తాలిబన్లు, ఆల్ ఖైదా ఎలాగైతే ఆయుధాల్ని ఉపయోగించి తమ వ్యతిరేకుల్ని మట్టుబెట్టాలని చూస్తాయో.. సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం అలాగే వాడుకుంటోంది. ప్రత్యర్థులెవరినీ వారు (మోదీ ప్రభుత్వం) వదిలిపెట్టడం లేదు. కేంద్ర సంస్థల్ని ఉపయోగిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది నిరంకుశత్వం, నియంతృత్వం’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

Bihar: బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఇంట్లో సీబీఐ సోదాలు.. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణ

కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్ వ్యవస్థల దుర్వినియోగంపై ఆదివారం(మార్చి 5,2023)న ప్రధాని మోదీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతల సంయుక్త లేఖ రాశారు. ప్రధానికి లేఖ రాసిన కె. చంద్రశేఖర రావు (BRS), మమతా బెనర్జీ (AITC), అరవింద్ కేజ్రీవాల్ (AAP), భగవంత్ మాన్ (AAP), తేజస్వి యాదవ్ (RJD), ఫరూక్ అబ్దుల్లా (JKNC), శరద్ పవార్ (NCP), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన, UBT), అఖిలేష్ యాదవ్ (SP) గవర్నర్, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేయడం మన ప్రజాస్వామ్యానికి మంచిదికాదని..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులపై కేంద్ర సంస్థల దుర్వినియోగం మనం ప్రజాస్వామ్యం నుండి నిరంకుశ పాలనకు మారినట్లు సూచిస్తోందన్నారు.

Shashi Tharoor: అందం, తెలివి గురించి యువతి అడిగిన ప్రశ్నకి శశి థరూర్ ఎపిక్ రిప్లై.. వైరల్ అవుతున్న వీడియో

నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. కేంద్ర సంస్థలపై భారత ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టమే అత్యున్నతమైనదన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని గౌరవించాలని సూచించారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర పాలనకు విఘాతం కలిగిస్తున్నాయని తెలిపారు.

Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

ఉద్దేశపూర్వకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లు బీజేపీయేతర ప్రభుత్వాలు నడుపుతున్న రాష్ట్రాల మధ్య విస్తృతమైన విభేదాలకు దారితీసేలా మారారని పేర్కొన్నారు. గవర్నర్ లు రాజ్యాంగ స్ఫూర్తికి ముప్పు కలిగిస్తున్నారని వెల్లడించారు. ఫిబ్రవరి 26న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సీబీఐ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అక్రమాలకు సంబంధించి అరెస్టు చేసిందని తెలిపారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ కుట్రతో కూడినవని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో విపక్ష నేతలు పేర్కొన్నారు.