Supreme Court: ఢిల్లీలో అధికారంపై సుప్రీం తీర్పును సమర్ధించిన సీపీఐ నారాయణ

కార్పోరేట్ కంపెనీలకు, బడా వ్యాపారస్థులకు ముందస్తు ప్రయోజనం చేకూర్చే విధంగా మోడి ప్రభుత్వం 2 వేల రూపాయల నోట్లు రద్దు చేసింది. గతంలో నోట్ల రద్దుతో టన్నుల కొద్ది నల్లధనం వైట్ మనీగా మారింది. 2వేల రూపాయల నోటు ముద్రణ చేపట్టవద్దని చెబితే పెడచెవిన పెట్టారు, దాని వల్ల దేశంలో నల్లధనం పోగుపడింది

Supreme Court: ఢిల్లీలో అధికారంపై సుప్రీం తీర్పును సమర్ధించిన సీపీఐ నారాయణ

CPI Narayana: ఢిల్లీలో అధికారాల పంపిణీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని పక్కన పెట్టారని ఆయన అన్నారు. గవర్నర్ రాజకీయాల్లో పాల్గొనాలని, ప్రభుత్వ వ్యవహారాల్లో వేలు పెట్టాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అంటూ ఆయన ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా గవర్నర్‭లు తమ అధికార పరిధికి మించి వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Narendra Modi: మోదీని చూసి దగ్గరకు వచ్చి మరీ పలకరించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కార్పోరేట్ కంపెనీలకు, బడా వ్యాపారస్థులకు ముందస్తు ప్రయోజనం చేకూర్చే విధంగా మోడి ప్రభుత్వం 2 వేల రూపాయల నోట్లు రద్దు చేసింది. గతంలో నోట్ల రద్దుతో టన్నుల కొద్ది నల్లధనం వైట్ మనీగా మారింది. 2వేల రూపాయల నోటు ముద్రణ చేపట్టవద్దని చెబితే పెడచెవిన పెట్టారు, దాని వల్ల దేశంలో నల్లధనం పోగుపడింది. 2 వేల రూపాయల నోట్‌లను రద్దు చేయకుండా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే 2 వేల రూపాయల నోట్లను రద్దు చెయ్యాలి. దేశంలో వచ్చే ఎన్నికలలో బీజేపీ విచ్చల విడిగా ఖర్చు పెట్టుకునే విధంగా వ్యవహరిస్తోంది. మోదీ సాధువు వేషంలో ప్రజలను వంచిస్తూ మోసానికి పాల్పడుతున్నారు’’ అని నారాయణ అన్నారు.

Rahul Gandhi: గంటలలోనే హామీలు చట్టాలు అవుతాయి.. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రాహుల్ గాంధీ

ఇక దేశ రాజధానిలో రెజర్లు చేస్తున్న నిరసనను ఉద్దేశించి సైతం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నారాయణ. ‘‘దేశంలో మహిళలను గౌరవించాలని ఒక పక్కన చెబుతూ… మహిళా రెజర్లను వేధించే కామాంధుడు బ్రిజ్ భూషణ్ ను తమ పార్టీ ఎంపీగా కొనసాగిస్తూ ఆయనను కాపాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మహిళలపై గౌరవం ఉంటే తక్షణమే బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకుని అరెస్ట్ చెయ్యాలి’’ అని అన్నారు.