MP: సీఎం ముందే పార్టీ అధ్యక్షుడి ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్ర మంత్రి
కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి లోకేంద్ర పరాశర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమం చివర్లో పార్టీ అధ్యక్షుడు ప్రసంగించడం సంప్రదాయమని అన్నారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడికి అత్యున్నత గౌరవం ఇస్తారని, చివర్లోనే ఆయన ప్రసంగం ఉంటుందని, కాంగ్రెస్‌కు ఇది అర్ధం కాదని రివర్స్ అటాక్ చేశారు. పార్టీ అధ్యక్షుడికి గౌరవ సూచకంగానే ఆయన ప్రసంగం విషయంలో సింధియా జోక్యం చేసుకున్నట్టు పరాశర్ వివరణ ఇచ్చారు.

scindia stops bjp president speech
MP: పార్టీ అధ్యక్షుడు మాట్లాడతారని చప్పట్ల మధ్య ఆహ్వానం అందింది. వెంటనే పార్టీ అధ్యక్షుడు మాట్లాడడానికి వస్తుండగా కేంద్ర మంత్రి ఆయనను అడ్డుకుని ప్రసంగించారు. ఇది జరిగింది ముఖ్యమంత్రి హాజరైన సభలోనే. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌లో జరిగిన ఘటన ఇది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ ప్రసంగించకుండా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అడ్డుకున్నారు. సీఎం చౌహాన్ అదే కార్యక్రమంలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Stray Dog Attack: రాజధానిలో దారుణ ఘటన.. వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి
రాష్ట్రంలోని మాధవ్ నేషనల్ పార్క్‌కు టైగర్ల తరలింపునకు సంబంధించి శివపురి జిల్లాలో బీజేపీ ఓ కార్యక్రమం నిర్వహించింది. తన పేరు రాగానే రాష్ట్ర బీజేపీ చీఫ్ శర్మ ప్రసంగించేందుకు మైకు వద్దకు వెళ్లారు. వేదికపైనే ఉన్న సింధియా వెంటనే ఆయన దగ్గరకు ఏదో చెప్పారు. శర్మ వెంటనే వెనక్కి వెళ్లి తిరిగి తన సీటులో కూర్చున్నారు. అనంతరం సింధియా ప్రసంగం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో సింధియాపై కాంగ్రెస్ మీడియా సెల్ చీఫ్ కేకే మిశ్రా విమర్శలు గుప్పించారు. ఇతర నేతలను వెనక్కినెట్టి, ముందుకు వెళ్లడం ఆయన (సింధియా) కుటుంబ సంప్రదాయమంటూ ఎద్దేవా చేశారు.
240 शब्दों में कई बार नेरेटिव तथ्यों से परे होते हैं,@BJP4India में मंच की परंपरा है आखिर में प्रदेश अध्यक्ष बोलते हैं ऐसे में @JM_Scindia ने @vdsharmabjp का सम्मान किया अपमान नहीं लेकिन नेरेटिव कुछ और बना. तथ्य सर्वोपरि हैं, आलोचना में भी. pic.twitter.com/p3RGQIUrD8
— Anurag Dwary (@Anurag_Dwary) March 11, 2023
కాగా, కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి లోకేంద్ర పరాశర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమం చివర్లో పార్టీ అధ్యక్షుడు ప్రసంగించడం సంప్రదాయమని అన్నారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడికి అత్యున్నత గౌరవం ఇస్తారని, చివర్లోనే ఆయన ప్రసంగం ఉంటుందని, కాంగ్రెస్‌కు ఇది అర్ధం కాదని రివర్స్ అటాక్ చేశారు. పార్టీ అధ్యక్షుడికి గౌరవ సూచకంగానే ఆయన ప్రసంగం విషయంలో సింధియా జోక్యం చేసుకున్నట్టు పరాశర్ వివరణ ఇచ్చారు.