Sharad Pawar: భారత్ జోడో యాత్రకు శరద్ పవార్ దూరం.. స్పష్టం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్‌ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్‌ వరకు కొనసాగనుంది. 150 రోజుల్లో 3,570 కి.మీల మేర కొనసాగనుంది.

Sharad Pawar: భారత్ జోడో యాత్రకు శరద్ పవార్ దూరం.. స్పష్టం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

Sharad Pawar not to join Congress Bharat Jodo Yatra says Jairam

Sharad Pawar: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ హాజరు కావడం లేదు. వాస్తవానికి ఈ యాత్రకు హాజరు కానున్నట్లు కొద్ది రోజుల కింద స్వయంగా శరద్ పవారే ప్రకటించారు. పవార్ హాజరుపై బుధవారం సైతం మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రకటన చేసింది. అయితే ఆకస్మిక అనారోగ్యం కారణంగా.. పవార్ ఆసుపత్రిలో చేరారని, అందుకే హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ గురువారం స్పష్టం చేశారు.

అయితే ఈ యాత్రకు ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, సుప్రియా సూలే, జితేంద్ర అహ్వాద్ శుక్రవారం హాజరు కానున్నట్లు కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు. ఇక శివసేన నుంచి ఆదిత్య థాకరే సైతం భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. ఇక పవార్ అనారోగ్యంపై జైరాం రమేష్ స్పందిస్తూ ‘‘శరద్ పవార్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు 3 నుంచి 4 వారాల పాటు విశ్రాంతి కావాలని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తెలియజేశాను. అందుకే శుక్రవారం నాటి యాత్రలో పవార్ హాజరు కావడం లేదు. ఆదిత్య థాకరే మాత్రం వస్తున్నారు’’ అని అన్నారు.

కొద్ది రోజుల క్రితం బారామతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవార్ మాట్లాడుతూ ‘‘భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి రాగానే.. అందులో పాల్గొంటాను. ఈ విషయమై కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ చవాన్‌, బాలాసాహెబ్‌ థోరాట్‌ నన్ను కలిశారు. వారి విజ్ణప్తి మేరకు హాజరు అవుతానని మాటిచ్చాను. సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్‌ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్‌ వరకు కొనసాగనుంది. 150 రోజుల్లో 3,570 కి.మీల మేర కొనసాగనుంది.

Maharashtra: వ్యాపారవేత్తకు చేదు అనుభవం.. ఫోన్ హ్యాక్ చేసి కోటి రూపాయలు కొట్టేశారు