తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు? 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు  వెళ్లేదెవరు..? రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 01:57 AM IST
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు? 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు  వెళ్లేదెవరు..? రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు  వెళ్లేదెవరు..? రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. సీఎం కేసీఆర్‌ మనసులో ఏముంది..? ఎవరెవరి పేర్లను ఫైనల్ చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇవాళ అభ్యర్థుల పేర్లు కేసీఆర్‌ ఖరారు చేయనుండడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

తెరపైకి రోజుకో నేత పేరు
పెద్దల సభకు వెళ్లేదెవరు.. ఇదే ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్‌లో ఆసక్తి రేపుతోంది. ఎల్లుండే నామినేషన్‌కి ఆఖరు తేది. అయినా ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటపడేందుకు అశావహులంతా తమదైన స్టయిల్‌లో ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకో పేరు తెరపైకి వస్తున్నా.. చివరకు తామే రేసులో ఉంటామని చాలామంది నేతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే రెండు రాజ్యసభ స్థానాలతో పాటు రెండు మండలి స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటిస్తారనే ప్రచారం నడుస్తోంది. స్పాట్..

మరోసారి కేకేకు అవకాశం? 
టీఆర్‌ఎస్‌లో రాజ్యసభకు వెళ్లే వారి లిస్ట్‌ చాలా పెద్దదిగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఫిల్టరింగ్‌ నడుస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా కొనసాగుతున్న కే.కేశవరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా అదే జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త పార్ధసారధి రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు పేరు కూడా పరిశీలనలో ఉందట. మరోవైపు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన దామోదర్‌రావుకు కూడా అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నాయి పార్టీ వర్గాలు. 

సురేష్‌రెడ్డికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం
నిజామాబాద్‌ స్థానిక సంస్థల అభ్యర్థిగా మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గవర్నర్‌ కోటాలో భర్తీ చేయాల్సిన స్థానంపై నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు. దేశపతి శ్రీనివాస్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పెద్దల సభపై ఆశలు పెంచుకున్న నేతలు.. ముఖ్యమంత్రితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లను కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యసభ, మండలి అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆ అదృష్టవంతులెవరన్నది మరికొన్ని గంటల్లోనే తేలనుంది.

See Also |  అమలాపాల్ మళ్లీ ప్రేమలో.. ప్రియుడు ఇతడేనా?