Navaratri 2023 : కష్టాలు పోగొట్టి సకల శుభాలనొసగే ‘శ్రీ దుర్గాదేవి’

నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. శారీరక అనారోగ్యాలతో పాటు, మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

Navaratri 2023 : కష్టాలు పోగొట్టి సకల శుభాలనొసగే ‘శ్రీ దుర్గాదేవి’

Navaratri 2023

Navaratri 2023 : నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారు ‘శ్రీ దుర్గాదేవి’ గా దర్శనం ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహాకాళిగా కూడా అమ్మవారిని పూజిస్తారు.

అమ్మవారు పరమేశ్వరుడిని భర్తగా పొందాలని అగ్ని సూత్రాల మధ్య కఠినమైన తపస్సు చేయడంతో ఆమె దేహం నల్లబడిందట. అందుకే ఈరోజు అమ్మవారి శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తారు. ఇలా చేసిన తర్వాత అమ్మవారు వెలుగులు వెదజల్లుతూ ఉంటుంది. అందుకే అమ్మవారిని మహాగౌరిగా కూడా కొలుస్తారు.

Navaratri 2023 : సిరి సంపదలను ప్రసాదించే ‘శ్రీ మహాలక్ష్మీ దేవి’

దేవీ భాగవతంలో ప్రకారం మధు కైటభులు అనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై విష్ణువుని మహా మాయ నిద్ర లేపుతుంది. యోగ నిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు రాక్షసులతో యుద్ధం చేసినా వారిని జయించలేకపోతాడు. ఆ సమయంలో మహాదేవి మధు కైటభులను మోహపూరితలను చేసింది. దాంతో వారు శ్రీ మహావిష్ణువుని నీకు ఏం వరం కావాలి? అని అడుగుతారు. రాక్షసులు తమకు శ్రీహరి చేతిలో మరణం తప్పదని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరతారు. వారిని సంహరించే సమయంలో మహాకాళిగా విష్ణువుకి అమ్మవారు సాయపడుతుంది. రాక్షస సంహారంలో దుర్గాదేవి నవ విధ రూపాల్లో అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

Navaratri 2023 : సంతానం, సౌభాగ్యం ప్రసాదించే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

శ్రీ దుర్గా దేవి అమ్మవారు ఈ రోజు ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి మందారాలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారికి ఈ రోజు పులిహోర, పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు ఎరుపురంగు చీరలు దానం చేస్తే మంచిది. దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు.