Ugadi 2023 : షడ్రుచుల సమ్మేళనం .. ఉగాది పచ్చడితో ఆరోగ్యం

మనిషి జీవితం సుఖ దు:ఖాల మేలు కలయిక.అలాగే ఉగాది పండుగ రోజున అత్యంత ప్రత్యేకంగా తయారు చేసే పచ్చడి కూడా షడ్రుచుల మేలు కలయిక. మన జీవితం షడ్రుచుల సమ్మేళనం అనేదానికి సూచనే ఈ ఉగాది పచ్చడి చెప్పే సత్యం. ఉగాది పచ్చడిలో షడ్రుచులుంటాయి. అంటే ఆరు రుచులు ఉంటాయి. ఈ పచ్చడి జీవిత సత్యాలకు సూచన మాత్రమేకాదు ఈ ఉగాది పచ్చడి తింతే చక్కటి ఆరోగ్య ప్రయోజన్నాయని నిపుణులు కూడా చెబుతుంటారు.

Ugadi 2023 : షడ్రుచుల సమ్మేళనం .. ఉగాది పచ్చడితో ఆరోగ్యం

Ugadi 2023

Ugadi 2023 : మనిషి జీవితం సుఖ దు:ఖాల మేలు కలయిక.అలాగే ఉగాది పండుగ రోజున అత్యంత ప్రత్యేకంగా తయారు చేసే పచ్చడి కూడా షడ్రుచుల మేలు కలయిక. మన జీవితం షడ్రుచుల సమ్మేళనం అనేదానికి సూచనే ఈ ఉగాది పచ్చడి చెప్పే సత్యం. ఉగాది పచ్చడిలో షడ్రుచులుంటాయి. అంటే ఆరు రుచులు ఉంటాయి. ఈ పచ్చడి జీవిత సత్యాలకు సూచన మాత్రమేకాదు ఈ ఉగాది పచ్చడి తింతే చక్కటి ఆరోగ్య ప్రయోజన్నాయని నిపుణులు కూడా చెబుతుంటారు. వసంతకాలం ఆగమనంలో వచ్చే మార్పులు వల్ల అనారోగ్యాలు దరచేరకుండా ఈ ఉగాది పచ్చడిలోని పదార్ధాలు శరీరాన్ని కాపాడతాయి. ఈ పచ్చడిలో ఉపయోగించే కొత్త బెల్లం,మామిడికాయ, వేప పువ్వు వంటి ప్రకృతి ఇచ్చిన పదార్ధాలు శరీరాన్ని రోగాలబారిన పడకుండా కాపాడతాయి. భారతీయుల పండుగలన్నీ ఆరోగ్యాలను పరిరక్షించే పండుగలే కావటం విశేషం. ఆయా రోజుల్లో వచ్చే పండుగల..ఆ పండుగలకు మనం తయారు చేసుకునే ఆహార పదార్ధాలు ఆయా రోజుల్లో వచ్చే అనారోగ్యాలను కాపాడుతుంటాయి. అదే భారతీయ పండుగలకు ఉండే గొప్పతనం..

Ugadi 2023 : ఉగాది పండుగ విశిష్టత .. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

ఎండాకాలాన్ని తట్టుకునే శక్తిని ఇచ్చే ఉగాది పచ్చడి..
ఈ పచ్చడి తరువాత అంటే ఉగాది తరువాత ఎండలు (ఎండాకాలం లేదా వేసవికాలం) తీవ్రమవుతాయి. ఎండాకాలాన్ని తట్టుకునే శక్తిని ఈ ఉగాది పచ్చడి ఇస్తుందని పెద్దలు చెబుతారు. పెద్దల మాట చద్దన్నమూట అని ఊరికే అనలేదు. ఈరోజుల్లో అంటే ఆహార నిపుణులు చెబుతున్నారు గానీ మన పూర్వీకులు ఏఏ కాలాల్లో ఏవేవి తినాలి అనేది ‘పండుగ’ల సంప్రదాయంలో ఎప్పుడో చెప్పారు. అదే భారతదేశం గొప్పతనం..భారతీయ పండుగల విశేషం..ఆరోగ్యపరంగా ఉగాది పచ్చడి ఎంతో మంచి చేస్తుంది. ఉగాది పచ్చడి గురించి ఆయుర్వేదంలో మన పూర్వీకులు పొందుపరిచారు.

Ugadi Pachadi Recipe | How to make Ugadi Pachadi - ASmallBite

ఆయుర్వేదంలో ఉగాది పచ్చడి విశిష్టత..
ఉగాది పచ్చడి శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలని హరిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఉగాది పచ్చడిలో రుచులన్నీ ఒకదాన్నొకటి బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఈ పచ్చడిలో పోషకాలు వ్యాధుల నుండీ రోగాల నుండీ రక్షిస్తాయి. ఈ పచ్చడిలో తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అనే ఆరు రుచులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్టే జీవితంలోని కష్ట సుఖాలనూ, ఎగుడుదిగుళ్ళనూ, మంచి చెడులనూ సమ్యమనంతో స్వీకరించాలన్నది ఈ ప్రసాదంలోని పరమార్ధమని చెబుతారు.

మరి ఈ పచ్చడిలో ఉన్న రుచుల గురించి వివరాలు చూసేద్దాం..

neem flower health benefits - Telugu News International - TNILIVE
చేదు (వేప పువ్వు) : ఉగాది పచ్చడిలో చేదు వేప పువ్వుల నుండి వస్తుంది. ఈ రుచి జీవితం అంత ఆనంద కరంకాని, బాధా కరమైన విషయాలని సూచిస్తుంది. సుఖాలే కాదు కష్టాలు కూడా జీవితంలో ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కొంటేనే జీవితంలో సుఖాలను అందుకోగలం అనే అర్థం దీంట్లో ఉంది. అదే చేదు. చేదును జీవితంలో భాగంగా చూడాలి. ఆయుర్వేదంలో వేపని సుమారు 35 రకాల వ్యాధులకి ఔషధం అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోకి చేరిన నులి పురుగులు వేప తినడం వల్ల చనిపోతాయి. వేపాకులు, వేపపూలు, వేప పండు, వేప గింజలు, వేప జిగురు, వేప వేళ్ళు, వేప బెరడు..ఇలా వేప అంటేనే ఔషధాల గని అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

These health benefits of jaggery make it a good alternative for sugar | HealthShots

తీపి (బెల్లం) : ఉగాది పచ్చడిలోని తీపి బెల్లం నుండి వస్తుంది. ఈ రుచి జీవితంలో ఆనందానికీ, సంతోషానికీ, సంతృప్తికీ సూచన. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థని బెల్లం బలోపేతం చేస్తుంది. బెల్లం లివర్ లోని విష పదార్ధాలని బయటకు పంపేస్తుంది. బెల్లంలో ఉండే జింక్, సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేసి ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ ని అడ్డుకుంటాయి. ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని ఇస్తాయి.

আম গাছ লাগাতে জমি কিভাবে প্রস্তুত করব, বুঝতে পারছি না। | কমিউনিটি | প্ল্যান্টিক্স

వగరు (మామిడి పిందెలు) : ఉగాది పచ్చడిలోని వగరు పచ్చి మామిడికాయల నుండి వస్తుంది. మామిడి కాలానికి ఉగాదే మొదలు. మామిడి ఆశ్చర్యానికి సంకేతం. జీవితంలో ఉండే ఆశ్చర్యాలు చాలాసార్లు ఆనందాన్నిస్తాయి. ఒక్కోసారి బాధను కలిగిస్తాయి. ప్రతి వ్యక్తీ ప్రిపేర్ అయి ఉండాలనే సంకేతం మామిడికాయ నుంచి నేర్చుకోవాలి. మామిడి ముక్కలు డీ హైడ్రేషన్ ని ప్రివెంట్ చేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ ని సక్రంగా జరిగేలా చేస్తాయి. మామిడిలోని పులుపు శరీరానికి ఇమ్యూనిటీని ఇస్తుంది. మామిడికాయ అంటే పులుపు అనే అనుకుంటాం. కానీ ఉగాది నాడికి వచ్చే మామిడి పిందెల్లో పులుపు కంటే వగరే ఎక్కువగా ఉంటుంది..

Benefits Of Green Chilli: ప‌చ్చిమిర్చి ప్ర‌తీరోజు తీసుకోవ‌డం వ‌ల‌న క‌లిగే ఆరోగ్య లాభాలు | Health Benefits Of Green Chilli MK– News18 Telugu

కారం (పచ్చిమిర్చి) : ఈ పచ్చడిలో కారం పచ్చి మిరపకాయల నుండి వస్తుంది. కొంతమంది పచ్చి మిరపకాయల బదులు మిరియాలు, పచ్చి కారం కూడా వినియోగిస్తారు. కానీ కారం మాత్రం ఉగాది పచ్చడిలో ఉండాల్సిందే. ఇది ఇమ్యూనిటీని పెంచి స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. శ్వాసకోస సమస్యలను రాకుండా చేస్తుంది.

Sea salt vs table salt: What is better? | The Times of India

ఉప్పు : ఉప్పు రుచికి మూలం. ఉప్పు లేకపోతే రుచి రాదు, అందుకే దీన్ని ‘రుచి’అంటారు. రుచి లేని జీవితం ఉప్పు లేని వంటలాగే చప్ప చప్పగా ఉంటుంది. ఉప్పు బద్ధకాన్ని వదిలిస్తుంది. డీహైడ్రేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. ఉప్పు విషయంలో కానీ గమనించాల్సింది ఏమిటంటే ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే తక్కువైనా ప్రమాదమే. సమపాళ్లలో ఉప్పు ఉండాల్సిందే.

chintapandu Archives - Chai Pakodi

పులుపు (చింతపండు) : ఉగాది పచ్చడిలోని పులుపు చింత పండు నుండి వస్తుంది. కొత్త చింతపండు వచ్చే కాలం ఇది. చింతపండులోని పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులనీ అవసరాలనీ సూచిస్తుంది. చింత‌పండులో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. చింతపండు శరీరం మినరల్స్ ని తేలికగా గ్రహించగలిగేలా చేస్తుంది. సిస్టమ్ ని బాగా క్లెన్స్ చేస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ లేకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.అలాగే శ‌రీరంలో ఉండే హానికార‌క ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తుంది. దీంతో క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. నాడుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

ఇలా ఉగాది పచ్చడిలో ఉండే తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అనే ఆరు రుచులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్టే జీవితంలోని కష్ట సుఖాలనూ, ఎగుడుదిగుళ్ళనూ, మంచి చెడులనూ సమ్యమనంతో స్వీకరించాలని ‘ఉగాది’పచ్చడిలోని అర్థం పరమార్థం అని పెద్దలు చెబుతున్నారు.