IND vs ENG : నో ఎంట్రీ.. తలుపులు మూసి తలపడుతారు

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదు అని నిర్ణయించుకుంది బీసీసీఐ.

IND vs ENG : నో ఎంట్రీ.. తలుపులు మూసి తలపడుతారు

Ind Vs Eng

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదు అని నిర్ణయించుకుంది బీసీసీఐ. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరిగిపోగా.. భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే చివరి మూడు టి20 మ్యాచ్‌లను ప్రేక్షకలు లేకుండానే నిర్వహించనున్నట్లు గుజరాత్‌ క్రికెట్‌ సంఘం స్పష్టం చేసింది. తొలి రెండు మ్యాచ్‌లకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించగా.. మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకుల్లేకుండా నిర్వహించనుంది.

ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు మోతెరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్నాయి. నాలుగు టెస్టుల సిరీస్‌లో చివరి రెండు టెస్టులు కూడా అదే స్టేడియంలో ఆడబడ్డాయి. మార్చి 16, 18, 20 తేదీల్లో జరగనున్న మ్యాచ్‌లకు టికెట్లు కొన్న ప్రేక్షకులకు డబ్బులను తిరిగి ఇస్తామని జిసిఎ ఉపాధ్యక్షుడు ధన్రాజ్ నాథ్వానీ తెలిపారు.

అహ్మదాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. నాథ్వానీ బిసిసిఐని సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 14 న ఆడిన రెండవ టి 20 లో, స్టేడియం మ్యాచ్ చూడటానికి దాదాపు 60 వేల మంది వచ్చారు. రెండవ టీ20ని చూడడానికి సుమారు 50వేల మంది స్టేడియానికి వచ్చారు. ఇక భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య పుణె వేదికగా మూడు వన్డేల సిరీస్‌ ప్రేక్షకులు లేకుండానే జరుగునుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ఈ నిర్ణయం తీసుకుంది.

మార్చి 23, 26, 28 తేదీల్లో ఎంసీఏ స్టేడియంలో మూడు వన్డేలు జరుగాల్సి ఉండగా.. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం సూచనల మేరకు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ఎంసీఏ.