Suresh Raina : సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రైనా తీవ్ర దుఖంలో మునిగిపోయాడు.

Suresh Raina : సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం

Suresh Raina

Suresh Raina : టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రైనా తీవ్ర దుఖంలో మునిగిపోయాడు. సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన ఘజియాబాద్ లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. త్రిలోక్ చంద్ మిలటరీ అధికారిగా పని చేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులను తయారు చేసేవారు. త్రిలోక్ చంద్ పూర్వీకులది జమ్ముకశ్మీర్ లోని రైనావరి గ్రామం. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం గ్రామాన్ని విడిచిపెట్టారు. యూపీలోని మురాద్ నగర్ లో స్థిరపడ్డారు.

ఆ సమయంలో తనకు వచ్చే రూ.10వేల జీతంతో.. సురేశ్​ రైనా క్రికెట్​ కోచింగ్​ ఫీజులను కట్టలేక ఇబ్బందులు పడ్డారు. 1998లో లక్నోలోని గురుగోవింద్​ సింగ్ స్పోర్ట్స్​ కాలేజీలో సురేశ్ రైనా చేరాడు. కశ్మీర్​ ఉదంతం గురించి తన తండ్రికి జ్ఞాపకం తెచ్చే ఏ అంశాన్ని మాట్లాడకుండా ఎల్లప్పుడూ జాగ్రత్త పడేవాడినని రైనా గతంలో చెప్పాడు.

WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

2020 ఆగస్టులో ధోనీతో పాటే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. టీమిండియాలో ఒక దశాబ్ధం పాటు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లోనూ అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా రైనా పేరు సంపాదించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ ​కింగ్స్, గుజరాత్ సూపర్​జెయింట్స్​ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 205 మ్యాచ్​లు ఆడాడు. ఐపీఎల్‌లో ఎక్కువకాలం సీఎస్‌కేకు ఆడాడు. ఈసారి రైనాను సీఎస్‌కే రిలీజ్‌ చేయడంతో ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న మెగా వేలంలో ఏ జట్టు అతడిని సొంతం చేసుకుంటుందో చూడాలి.

వ్యక్తిగత కారణాలతో 2020 ఐపీఎల్ సీజన్‌కి దూరమైన రైనా.. 2021 ఐపీఎల్ సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో.. ఐపీఎల్ 2022 ముంగిట రైనాను వేలానికి వదిలేసింది చెన్నై సూపర్ కింగ్స్. వేలానికి రూ.2 కోట్ల కనీస ధరతో రైనా వస్తున్నాడు.

Raj Angad Bawa: ఒకప్పుడు గోల్డ్ మెడల్ విన్నర్ మనువడే వరల్డ్ కప్ విన్నర్

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడిన సురేష్ రైనా 32.51 సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రైనా అత్యధిక స్కోర్ 100 పరుగులు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు 506 ఫోర్లు, 206 సిక్స్‌లు బాదాడు. అప్పుడప్పుడూ బౌలింగ్ కూడా వేసే రైనా.. ఇప్పటివరకు 25 వికెట్లు పడగొట్టాడు.

త్రిలోక్‌చంద్ అంత్యక్రియలు ఘజియాబాద్‌లో సోమవారం జరగనున్నాయి. ఈరోజే కన్నుమూసిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కి సురేశ్ రైనా ట్విట్టర్‌లో నివాళి అర్పించిన గంటల వ్యవధిలోనే అతని తండ్రి కన్నుమూయడం బాధాకరం.