Cricket: టీమిండియా మాజీ క్రికెటర్ గుండెపోటుతో మృతి

టీమిండియా మాజీ క్రికెటర్ 1983వరల్డ్ కప్ విన్నర్ యశ్‌పాల్ శర్మ మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియాలో ఒకరైన యశ్.. 34.28తో 240పరుగులు నమోదుచేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్స్ లోనూ 60నమోదు చేయగలిగారు.

Cricket: టీమిండియా మాజీ క్రికెటర్ గుండెపోటుతో మృతి

Cricket

Cricket: టీమిండియా మాజీ క్రికెటర్ 1983వరల్డ్ కప్ విన్నర్ యశ్‌పాల్ శర్మ మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియాలో ఒకరైన యశ్.. 34.28తో 240పరుగులు నమోదుచేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్స్ లోనూ 60నమోదు చేయగలిగారు.

66ఏళ్ల వయస్సులో భార్యతో కలిసి ఉంటున్న యశ్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పంజాబ్ మాజీ క్రికెటర్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసేవాడు. 1979 నుంచి 1983వరకూ ఫుల్ ఫాంలో ఉన్నాడు. 37టెస్టులు ఆడిన ఆయన 1606పరుగులు నమోదు చేయగా అందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరనీలు ఉన్నాయి.

1979లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో యశ్ పాల్ అరంగ్రేట మ్యాచ్ ఆడాడు. 1972లో పంజాబ్ స్కూల్స్ వర్సెస్ జమ్మూ అండ్ కశ్మీర్ స్కూల్స్ మధ్య మ్యాచ్ లోనే యశ్ పాల్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. రెండేళ్లలోనే రాష్ట స్థాయి జట్టుకు, నార్త్ జోన్ టీంకు ఆడి విజ్జీ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ పై ఆడి 173పరుగుల అధిక స్కోరు నమోదు చేయగలిగాడు.