Virat Kohli : వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు.. సంగక్కర రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. ఇక మిగిలింది సచిన్ మాత్రమే..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు.
Virat Kohli overtakes Sangakkara in this all time list closer to Sachin Tendulkar
Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 54 పరుగుల వద్ద కోహ్లీ (Virat Kohli) ఈ ఘనత అందుకున్నాడు.
ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు. 404 వన్డేల్లో 41.98 సగటుతో 14234 పరుగులను సంగక్కర సాధించాడు. ఇక కోహ్లీ 305 మ్యాచ్‌ల్లోనే సంగక్కరను అధిగమించాడు. ఇక ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 18426 పరుగులు సాధించాడు.
Rohit Sharma : మూడో వన్డేలో ఆసీస్ పై రోహిత్ శర్మ సెంచరీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 శతకాలు..
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 463 మ్యాచ్‌ల్లో 18426 పరుగులు
* విరాట్ కోహ్లీ (భారత్) – 305 మ్యాచ్‌ల్లో 14255 పరుగులు
* కుమార సంగక్కర (శ్రీలంక) – 404 మ్యాచ్‌ల్లో 14234 పరుగులు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 375 మ్యాచ్‌ల్లో 13704 పరుగులు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 404 మ్యాచ్‌ల్లో 13430 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే… మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా (56) హాఫ్ సెంచరీ చేయగా మిచెల్ మార్ష్ (41), మాథ్యూ షార్ట్ (30) రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లు ఒక్కొ వికెట్ సాధించారు.
ఆ తరువాత రోహిత్ శర్మ(121 నాటౌట్; 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టగా, విరాట్ కోహ్లీ (74 నాటౌట్; 81 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి అందుకుంది.
