బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ భేటీలో ఏం తేల్చనున్నారు? జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందే..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌లోపే బీసీ కోటాపై ఏదో ఒకటి తేల్చాలని భావిస్తున్నారట సీఎం రేవంత్.

బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ భేటీలో ఏం తేల్చనున్నారు? జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందే..

Updated On : October 25, 2025 / 10:39 PM IST

తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల వ్యవహారం కైలాసం ఆటలో పాము మింగినట్లు అయింది. ఎన్నిల నోటిఫికేషన్ వచ్చాక హైకోర్టు బ్రేక్ వేసింది. నవంబర్ 3న బీసీల 42 శాతం రిజర్వేషన్లపై మరోసారి విచారణ చేయనుంది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం. దీంతో హైకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయాలని డిసైడ్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..నవంబర్ 7న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారట.

రిజర్వేషన్లు 50శాతంకు లోబడి ఉండాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 9 జారీ చేయడంతో హైకోర్ట్ కొట్టేసింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంది. అది కావాలంటే కేంద్రప్రభుత్వం ఆమోదం తప్పనిసరి.

అది రాజకీయ అంశాలతో ముడిపడి ఉండటంతో..నవంబర్ 3న హైకోర్ట్ ఇచ్చే తీర్పు కోసం వెయిట్ చేస్తోంది రేవంత్ సర్కార్. కోర్టు తీర్పును బట్టి నవంబర్ 7న క్యాబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట. 42 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమలు సాధ్యం కాదనే అంచనాకు వచ్చారట. దీంతో బీసీ రిజర్వేషన్లపై ఫ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని రేవంత్ డిసైడ్ అయినట్లు టాక్.

జోగి రమేష్‌ను వదిలిపెట్టని నకిలీ లిక్కర్ ఎపిసోడ్.. మెంటల్‌ టార్చర్‌గా మారిన ఐవీఆర్ఎస్ కాల్స్

బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాల దూకుడును కట్టడి చేసేందుకు స్పెషల్ స్కెచ్ వేస్తున్నారట రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందే రిజర్వేషన్ల అంశాన్ని కొలిక్కి తేవాలని భావిస్తున్నారట. 7న క్యాబినెట్ భేటీ తర్వాత..ఒకటి రెండ్రోజుల్లోనే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలనేది తాజాగా సీయం రేవంత్ఎత్తుగడగా తెలుస్తోంది. ఆ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, వామపక్షాలతో పాటు..అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించనుందట సర్కార్.

ఈ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై పార్టీల అభిప్రాయాలను తీసుకోనుంది. న్యాయస్థానం అనుమతించకపోవడంతో..కాంగ్రెస్ పార్టీ పరంగా..బీసీలకు 42 శాతం ఇస్తామని చెప్తూ… అన్ని పార్టీలనూ అదే విధంగా సీట్లు ఇవ్వాలని కోరనుందట. ఆల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్షాలు సానుకూలంగా స్పందిస్తే..బీసీలకు ఇచ్చిన మాటను అనధికారికంగా అమలు చేశామని చెప్పుకునే వ్యూహం రచిస్తోందట.

లేకపోతే బ్లేమ్ గమ్‌ నే అస్త్రంగా వాడుకోవాలని..పార్టీ పరంగా బీసీలకు 42శాతం టికెట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒప్పుకోకపోతే..ఆ పార్టీలు బీసీ వ్యతిరేకులనే ప్రచారంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తోందట. అవసరమైతే అఖిపలక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు కూడా రేవంత్ సర్కార్ సిద్ధం అవుతుందని సమాచారం. ఇలా బీసీ రిజర్వేషన్లపై మరోసారి కేంద్రాన్ని కార్నర్ చేసే స్కెచ్ కూడా వేస్తున్నారట.

అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌లోపే బీసీ కోటాపై ఏదో ఒకటి తేల్చాలని భావిస్తున్నారట సీఎం రేవంత్. పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇస్తామని లోకల్ బాడీ ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ ఇస్తే..జూబ్లీహిల్స్లో మైలేజ్ పొందొచ్చని ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే జూబ్లీహిల్స్లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చామని..స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పుకునేందుకు రెడీ అవుతోందట కాంగ్రెస్. ఈ వ్యూహాత్మక ఆలోచనతోనే..నవంబర్ 7న క్యాబినెట్ మీటింగ్ పెట్టారట సీఎం రేవంత్. మరి బీసీ కోటాపై కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి మరి.