T20 World Cup-2022: కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శనపై రాహుల్ ద్రవిడ్ స్పందన

‘‘కేఎల్ రాహుల్ అద్భుత ఆటగాడని నేను భావిస్తున్నాను. గతంలో తనను తాను నిరూపించుకున్నాడు. అతడు బాగానే బ్యాటింగ్ చేస్తాడని భావిస్తున్నాను. టీ20ల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణించడం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుతం జరుగుతోన్న టోర్నమెంట్ సవాళ్లతో కూడుకుని ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాలో ప్రాక్టీసు మ్యాచుల్లో కేఎల్ రాహుల్ బాగా ఆడాడు. రానున్న మ్యాచుల్లో మళ్ళీ పుంజుకుంటాడు’’ అని ద్రవిడ్ చెప్పారు.

T20 World Cup-2022: కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శనపై రాహుల్ ద్రవిడ్ స్పందన

Asia Cup 2022

T20 World Cup-2022: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ టీ20 ప్రపంచ కప్ లో పేలవ ప్రదర్శన కనబర్చుతున్నాడు. ఈ టోర్నమెంట్లో పాక్ తో జరిగిన మ్యాచులో 4, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో 9, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి ఆటతీరుపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు.

‘‘కేఎల్ రాహుల్ అద్భుత ఆటగాడని నేను భావిస్తున్నాను. గతంలో తనను తాను నిరూపించుకున్నాడు. అతడు బాగానే బ్యాటింగ్ చేస్తాడని భావిస్తున్నాను. టీ20ల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణించడం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుతం జరుగుతోన్న టోర్నమెంట్ సవాళ్లతో కూడుకుని ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాలో ప్రాక్టీసు మ్యాచుల్లో కేఎల్ రాహుల్ బాగా ఆడాడు. రానున్న మ్యాచుల్లో మళ్ళీ పుంజుకుంటాడు’’ అని ద్రవిడ్ చెప్పారు.

‘‘కేఎల్ రాహుల్ సామర్థ్యం ఎంతో మనకు తెలుసు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు అతడు అందుకు తగ్గట్టుగా ఉన్నాడు. అతడి ఆటతీరు పట్ల మేము సంతృప్తిగానే ఉన్నాం. మేము భారత ఆటగాళ్లతో సంభాషిస్తూనే ఉంటాం. అవన్నీ చెప్పడం కుదరదు. మా మద్దతు తనకు ఉందని కేఎల్ రాహుల్ కు తెలుసు. ఎన్నో టోర్నమెంట్లలో టీమిండియా ఆడుతోంది. విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటూ భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. భారత ఆటగాళ్లపై కెప్టెన్ రోహిత్ శర్మకు నమ్మకం ఉంది’’ అని రాహుల్ ద్రవిడ్ అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..