Ind Vs NZ 2nd T20I : వాటే మ్యాచ్.. ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై భారత్ విజయం, సిరీస్ సమం

న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్ భారత్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో కివీస్ పై విక్టరీ కొట్టింది. ఈ విజయంతో సిరీస్ ను 1-1 తో సమం చేసింది.

Ind Vs NZ 2nd T20I : వాటే మ్యాచ్.. ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై భారత్ విజయం, సిరీస్ సమం

Ind Vs NZ 2nd T20I : నరాలు తెగే ఉత్కంఠ. బంతి బంతికి బీపీ పెరిగిపోయింది. జుట్టు ఊడిపోయేంత టెన్షన్. నువ్వా నేనా అన్నట్టుగా నడిచిన పోరాటం. చివరికి.. విజయం భారత్ నే వరించింది. న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్ తీవ్ర ఉత్కంఠభరితంగా సాగింది. క్రికెట్ లవర్స్ ని ఎంతో టెన్షన్ పెట్టిన ఈ మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో కివీస్ పై విక్టరీ కొట్టింది. ఈ విజయంతో సిరీస్ ను 1-1 తో సమం చేసింది.

టార్గెట్ చాలా చిన్నదే. 20 ఓవర్లలో జస్ట్ 100 పరుగులు కొడితే చాలు. దీంతో అంతా గెలుపు భారత్ దే అనుకున్నారు. మనోళ్లు చాలా ఈజీగా మ్యాచ్ నెగ్గేస్తారని ఆశించారు. కానీ, గ్రౌండ్ లోకి దిగాక తెలిసింది. ఆ పిచ్ మీద బ్యాటింగ్ ఎంత కష్టంగా ఉందో. 100 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరి బంతి వరకు వేచి చూడాల్సి వచ్చింది.

Also Read..T20 Cricket: టీ20 ఫార్మాట్‌లో అత్యధిక నో బాల్స్ వేసింది ఇండియా బౌలరేనట .. ఎన్ని నో ‌బాల్స్ వేశాడంటే..

100 పరుగుల టార్గెట్ ను 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత్ చేజ్ చేసింది. మరో బంతి మిగిలి ఉండగా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత బ్యాటర్లలో శుభ్ మన్ గిల్ 11, ఇషాన్ కిషన్ 19, రాహుల్ త్రిపాఠి 13, సుందర్ 10, సూర్య కుమార్ యాదవ్ 26*, హార్ధిక్ పాండ్యా 15* రన్స్ చేశారు. ఈ టీ20 మ్యాచ్ లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. కివీస్ జట్టులో కానీ, భారత జట్టులో కానీ ఒక్క బ్యాటర్ కూడా సిక్స్ కొట్టింది లేదు.

కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, సోదీ చెరో వికెట్ తీశారు. ఇక కీలకమైన, సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 1న జరగనుంది.

Also Read..MS Dhoni: నిన్న‌టి మ్యాచులో ‘ధోనీ.. ధోనీ’ అంటూ అభిమానుల నినాదాలు.. వీడియో

రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. లక్నోలో జరిగని ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 99 పరుగులే చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా చెరో వికెట్ తీశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్క్ చాప్ మన్ 14, మైకేల్ బ్రేస్వెల్ 14, ఫిన్ అలెన్ 11, డెవాన్ కాన్వే 11 పరుగులు చేశారు. ధాటిగా ఆడే గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులకే ఔట్ కాగా, డారిల్ మిచెల్ (8) కూడా విఫలం అయ్యాడు.