IND Vs NZ : టీ20 సిరీస్‌లో భారత్ బోణీ.. ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై విజయం

న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్ లో కివీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.

IND Vs NZ : టీ20 సిరీస్‌లో భారత్ బోణీ.. ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై విజయం

India Vs New Zealand

IND Vs NZ : న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్ లో కివీస్ పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48), రిషబ్ పంత్(17 బంతుల్లో 17) రాణించారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. మిచెల్ సాట్నర్, డారెల్ మిచెల్ తలో వికెట్ తీశారు.

Old Age : వృద్ధుల్లో తిన్న ఆహారం ఎందుకు వంటపట్టదో తెలుసా?..

చివరి ఓవర్లో భారత్ విజయానికి పది పరుగులు అవసరం కాగా.. మొదటి బంతి వైడ్‌. తర్వాత వేసిన తొలి బంతికి వెంకటేశ్ అయ్యర్‌ (4) ఫోర్‌ బాది తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీంతో మరింత ఉత్కంఠ ఏర్పడింది. నాలుగో బంతికి పంత్ (17) ఫోర్‌ కొట్టి ఇండియాను గెలిపించాడు.

న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా జైపూర్ లో మొదటి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. భారత్ ముందు 165 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ బ్యాటర్స్ లో మార్టిన్ గప్టిల్ (70), మార్క్ చాప్ మన్ (63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, సిరాజ్ చెరో వికెట్ తీశారు.

స్కోర్లు..
కివీస్-164/6
భారత్-166/5(19.4 ఓవర్లు)