IPL 2021 MI Vs DC.. ఉత్కంఠ పోరులో ముంబైపై ఢిల్లీ గెలుపు

ఐపీఎల్ రెండో దశలో భాగంగా షార్జా వేదికగా ముంబయి ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బ

IPL 2021 MI Vs DC.. ఉత్కంఠ పోరులో ముంబైపై ఢిల్లీ గెలుపు

Delhi Beats Mumbai

IPL 2021 MI Vs DC : ఐపీఎల్ రెండో దశలో భాగంగా షార్జా వేదికగా ముంబయి ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే ఢిల్లీ ఛేదించింది. ఈ క్రమంలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 26, అశ్విన్ 20 నాటౌట్, హెట్మెయర్ 15 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, జయంత్, కృనాల్, బుమ్రా, కౌల్టర్ నైల్ తలో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ఢిల్లీ కేపిటల్స్ కి ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. పవర్‌ ప్లే పూర్తి కాకముందే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శిఖర్‌ ధావన్‌ (8), పృథ్వీ షా (6), స్టీవెన్‌ స్మిత్‌ (9) వరుసగా పెవిలియన్‌ చేరారు.

Hair Fall : చేప, చక్కర, గుడ్డు తెల్లసొన అధికంగా తింటున్నారా! అయితే అది రావటం ఖాయం?

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముంబయి జట్టుకి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ(7) అవేశ్‌ ఖాన్‌ వేసిన రెండో ఓవర్లో బౌల్డయ్యాడు. మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్‌ (19) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన ఏడో ఓవర్లో నోర్జేకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. సౌరభ్‌ తివారి (15), కీరన్‌ పొలార్డ్‌(6) ఆకట్టుకోలేకపోయారు.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

ఆఖర్లో వచ్చిన హార్దిక్‌ పాండ్య (17), జయంత్‌ యాదవ్‌ (11) నిరాశ పరిచాడు. నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ (0) డకౌటయ్యాడు. కృనాల్‌ పాండ్య (13), జస్ప్రీత్ బుమ్రా (1) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌ చెరో మూడు వికెట్లు తీశారు. అన్రిచ్‌ నోర్జే, రవిచంద్రన్‌ అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు. ముంబయిని ఓడించిన ఢిల్లీ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి చేరింది.

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ రెండో దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఢిల్లీ కేపిటల్స్ గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో అనూహ్యంగా కంగుతింది. ఇప్పుడు ముంబైపై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించింది.

ఈ రోజు మ్యాచ్‌ గెలిచి.. తనతో పాటు 10 పాయింట్లతో సమానంగా ఉన్న పంజాబ్‌, కోల్‌కతాను అధిగమించాలని ముంబై అనుకుంది. కానీ, ఓటమిపాలైంది.