IPL 2023: చావో.. రేవో..! రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్.. గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువ అంటే?

రాజస్థాన్ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు నెగ్గగా.. బెంగళూరు జట్టు 11 మ్యాచ్‌లలో అయిదు మాత్రమే విజయం సాధించింది.

IPL 2023: చావో.. రేవో..! రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్.. గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువ అంటే?

RR vs RCB Teams

IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. చివరి ఓవర్, చివరి బాల్ వరకు గెలిచే జట్టు ఏదో చెప్పడం కష్టంగా మారుతుంది. ఈ ఐపీఎల్ టోర్నీలో మొత్తం పది జట్లు ఆడుతున్నాయి. వీటిలో ఇప్పటికే ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుసైతం దాదాపు ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కోల్‌కతా జట్టుకూడా ప్లే ఆప్స్ చేరే అవకాశాలను కష్టంగా మార్చుకుంది. మిగిలిన జట్లకు ప్లే‌ఆఫ్స్‌కు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ జట్టు తదుపరి మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

IPL 2023: ఢిల్లీ పై పంజాబ్ ఘ‌న విజ‌యం.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ 16 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. ఆ తరువాత చెన్నై 15, ముంబయి 14, లక్నో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఏ జట్టు అయినా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కనీసం ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి ఉండాలి. ఈ లెక్కప్రకారం.. గుజరాత్ జట్టు దాదాపుగా ప్లే‌ఆఫ్స్‌కు చేరినట్లుగా చెప్పొచ్చు. ఇంకో మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. ఈరోజు 7గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు అవుతుంది. ఒకవేళ ఓడిపోతే ఆ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.

IPL 2023:ఉప్ప‌ల్‌లో మ‌రో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ పై ల‌క్నో విజ‌యం.. హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్ ఆశ‌లు గ‌ల్లంతు..!

బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈరోజు 3.30గంటలకు జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 12 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. బెంగళూరు 11 మ్యాచ్‌లు ఆడి ఏడవ స్థానంలో ఉంది. ఈ రెండు జట్లలో ఎవరు ఓడినా తర్వాతి దశకు అర్హత సాధించడం దాదాపు అసాధ్యమేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఓడిన జట్టు ఏడు కంటే ఎక్కువ విజయాలతో లీగ్ దశను ముగించలేదు.

IPL 2023: ఉప్ప‌ల్‌లో గౌత‌మ్ గంభీర్‌ను టార్గెట్ చేసిన అభిమానులు.. కోహ్లి కోహ్లి అంటూ..

రాజస్థాన్ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు నెగ్గగా.. బెంగళూరు 11 మ్యాచ్ లలో అయిదు మాత్రమే విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ లో రెండు జట్లలో ఎవరు ఓడినా వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయినట్లే. దీంతో ఇరు జట్లు ఈరోజు మ్యాచ్‌లో విజయం సాధించేందుకు పట్టుదలతో ఉన్నాయి. మరి ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధిస్తారనేది వేచి చూడాల్సిందే. రెండు జట్ల బలాబలాలను బట్టి చూస్తే ఆర్సీబీ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు.