IPL2022 KKR Vs MI : కుమ్మేసిన కమిన్స్.. కోల్‌కతా ఖాతాలో మూడో విజయం..ముంబై హ్యాట్రిక్ పరాజయం
ముంబై నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్ ను కోల్ కతా జట్టు 16 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. 5 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది.

Ipl2022 Mi Vs Kkr (1)
IPL2022 KKR Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై కోల్ కతా ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్ ను కోల్ కతా జట్టు 16 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో 5 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. కోల్ కతా బ్యాటర్లలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్, ప్యాట్ కమిన్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
ముఖ్యంగా కమిన్స్ కుమ్మేశాడు. ఆఖరిలో వచ్చి బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. సిక్సుల వర్షం కురిపించాడు. మ్యాచ్ ని ఏకపక్షం చేశాడు. కమిన్స్ 15 బంతుల్లోనే 56 పరుగులు చేశాడంటే ఎంత ధాటిగా ఆడాడో తెలుస్తుంది. అతడి స్కోర్ లో 6 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. వెంకటేశ్ అయ్యర్ 41 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కమిన్స్, అయ్యర్ నాటౌట్ గా నిలిచారు. ముంబై బౌలర్లలో టైమల్ మిల్స్, మురుగన్ అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. డానియల్ సామ్స్ ఒక వికెట్ తీశాడు. టీ20 మెగా టోర్నీలో కోల్‌కతా కు ఇది మూడో విజయం. కాగా, ముంబైకి వరుసగా మూడో పరాజయం.(IPL2022 KKR Vs MI)
IPL 2022 Season 15: మ్యాక్స్‌వెల్‌కు మసాజ్ చేసిన విరాట్ కోహ్లీ
పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్‌ను ఎంచుకుని ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 52 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తిలక్ వర్మ (38), దెవాల్డ్ బ్రెవిస్ (28), కీరన్ పొలార్డ్ (22) పరుగులతో రాణించారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (3) మరోమారు నిరాశ పరిచాడు. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు.
తుది జట్ల వివరాలు..
కోల్‌కతా : అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, ఉమేశ్ యాదవ్, రసిఖ్ సలాం, వరుణ్ చక్రవర్తి
IPL 2022: అలా చూస్తే మహేంద్ర సింగ్ ధోనీ.. దినేశ్ కార్తీక్ సమానమే
ముంబయి : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవీస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ తంపి
స్కోర్లు..
ముంబై ఇండియన్స్ – 20 ఓవర్లలో 161/4
కోల్ కతా నైట్ రైడర్స్ – 16 ఓవర్లలో 162/5
Pat Cummins finishes things off in style!
Also brings up the joint fastest half-century in #TATAIPL off 14 deliveries.#KKR win by 5 wickets with 24 balls to spare.
Scorecard – https://t.co/22oFJJzGVN #KKRvMI #TATAIPL pic.twitter.com/r5ahBcIWgR
— IndianPremierLeague (@IPL) April 6, 2022