MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? సీఎస్‌కే విజయం తరువాత ఏం చెప్పారంటే

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడే విషయంపై ధోనీ మాట్లాడుతూ.. రాబోయే తొమ్మిది నెలలు కష్టపడి తిరిగి ఒక సీజన్ ఆడటం కష్టం. అందుకు శరీరం సహకరించాలి.

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? సీఎస్‌కే విజయం తరువాత ఏం చెప్పారంటే

MS Dhoni

MS Dhoni Retirement Plan: ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు అద‌ర‌గొట్టింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్లు అందుకున్న‌ ముంబై ఇండియ‌న్స్ రికార్డును స‌మం చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. విజయం తరువాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడారు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకొనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

IPL 2023 Prize Money: ఐపీఎల్‌లో ఏ జట్టుకు ఎంత ఫ్రైజ్‌మనీ వచ్చింది.. ఏ ప్లేయర్‌కు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడే విషయంపై ధోనీ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి రిటైర్మెంట్ విషయంపై ఎలాంటి ఆలోచన చేయలేదని చెప్పారు. మనం పరిస్థితులను పరిశీలిస్తే నేను పదవీ విరమణ చేయడానికి ఇదే సరైన సమయం. నేను ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించడం పెద్ద విషయం కాదు. కానీ, చెన్నై జట్టు అభిమానులు నాపై ప్రేమను కురిపించిన తీరు, నేను మరో సీజన్ ఆడడం వారికి నా బహుమతి. వాళ్లు చూపించిన ప్రేమ, అభిమానం నేనుకూడా వాళ్ల కోసం ఏదైనా చేయాలని అనిపిస్తుంటుంది. కానీ, రాబోయే తొమ్మిది నెలలు కష్టపడి తిరిగి ఒక సీజన్ ఆడటం కష్టం. అందుకు శరీరం సహకరించాలి. దానిని బట్టి నా రిటైర్మెంట్ ప్రకటన ఉంటుంది అని ధోని క్లారిటీ ఇచ్చారు.

IPL2023 Final: ఐపీఎల్‌-16 టైటిల్ విజేత‌గా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ పై విజ‌యం

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభంకు ముందు, మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలోనూ మహేందర్ సింగ్ ధోనీ రిటైర్మెంట్ విషయంపై వార్తలు వచ్చాయి. సీఎస్‌కే ఆడిన పలు మ్యాచ్‌లలో ధోనీ కొంచెం ఇబ్బంది పడటం కనిపించింది. వయస్సు రిత్యా ఇక ధోనీ రిటైర్మెంట్ ఖాయమని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.