T20 World Cup : టీమిండియా కొత్త జెర్సీ ఎలా ఉంది ?

టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ 2021, అక్టోబర్ 13వ తేదీ బుధవారం విడుదల చేసింది. జెర్సీ కలర్ పాతదే అయినా...టీ 20 ప్రపంచకప్ సందర్భంగా...కొత్తగా తయారు చేశారు.

T20 World Cup : టీమిండియా కొత్త జెర్సీ ఎలా ఉంది ?

Ipl 2021

Team India New Jersey : 2021, టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2021, అక్టోబర్ 17వ తేద నుంచి నవంబర్ 14 వరకు ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు మ్యాచ్ లు ప్రారంభం అవుతాయా ? అని క్రీడాభిమానులు ఎదురు చూస్తున్నారు. టీమిండియా…తన తొలి మ్యాచ్ దాయాది దేశం పాకిస్తాన్ తో తలపడనుంది. అయితే…ఈ మ్యాచ్ ల్లో బరిలోకి దిగే టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ 2021, అక్టోబర్ 13వ తేదీ బుధవారం విడుదల చేసింది.

Read More : Akhil : విరాట్ కోహ్లీ బయోపిక్ లో అఖిల్ ??

జెర్సీ కలర్ పాతదే అయినా…టీ 20 ప్రపంచకప్ సందర్భంగా…కొత్తగా తయారు చేశారు. నేవీ బ్లూ కలర్ లో ఉన్న జెర్సీపై ముందుభాగంలో రాయల్ బ్లూ కలర్స్ షేడ్స్ ఉన్నాయి. దీనిపై MPL స్పోర్ట్స్,  బైజూస్ యాప్ లు కనిపిస్తాయి. ఇండియా అనే అక్షరాలు మాత్రం ఆరెంజ్ కలర్ లో కనిపించే విధంగా తయారు చేశారు. ఇక జెర్సీ ఎడమభాగంలో…బీసీసీఐ లోగోతో పాటు…కొత్తగా మూడు చుక్కలు ఏర్పాటు చేయడం విశేషం. మూడు ప్రపంచకప్ లు సాధించిందని గుర్తుగా ఈ మూడు చుక్కలుండనున్నాయి.

Read More : Rahul Dravid: టీమిండియా కోచ్ పదవి ఆఫర్ సున్నితంగా తిరస్కరించిన ద్రవిడ్

1983 వన్డే ప్రపంచకప్, ధోనీ ఆధ్వర్యంలో 2007 టీ 20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ లను టీమిండియా సొంతం చేసుకుంది. ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా..టీమిండియా అక్టోబర్ 18, 20న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనుంది. ప్రపంచ కప్ లో భారత్ టీంలో ఎవరు ఉంటారు ? ఎవరు ప్లేస్ దక్కించుకుంటారో తెలియడం లేదు. అక్టోబర్ 15వ తేదీన టీమిండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది.