Bangladesh vs India: రేపటి నుంచి వన్డే సిరీస్.. గాయంతో దూరమైన షమీ

‘‘ట్రైనింగ్ సెషన్ లో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ భుజానికి గాయమైంది. బెంగళూరులోని ఎన్సీఏలో బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో అతడు ఉన్నాడు. మూడు మ్యాచుల సిరీస్ లో ఆడడం లేదు. దీంతో షమీ స్థానంలో ఉమ్రాన్ ను స్క్వాడ్ లోకి తీసుకోవాలని ఆలియండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది’’ అని బీసీసీఐ తెలిపింది.

Bangladesh vs India: రేపటి నుంచి వన్డే సిరీస్.. గాయంతో దూరమైన షమీ

Bangladesh vs India

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల సారథులు ఇవాళ వన్డే సిరీస్ కప్ ను ఆవిష్కరించారు. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి వన్డే మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కప్ తో టీమిండియా-బంగ్లాదేశ్ కెప్టెన్లు ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

అలాగే, వన్డే సిరీస్ స్క్వాడ్ లో మొహమ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ను తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. ‘‘ట్రైనింగ్ సెషన్ లో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ భుజానికి గాయమైంది. బెంగళూరులోని ఎన్సీఏలో బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో అతడు ఉన్నాడు. మూడు మ్యాచుల సిరీస్ లో ఆడడం లేదు. దీంతో షమీ స్థానంలో ఉమ్రాన్ ను స్క్వాడ్ లోకి తీసుకోవాలని ఆలియండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది’’ అని బీసీసీఐ తెలిపింది.

Bangladesh vs India: బంగ్లాదేశ్ చేరుకున్న టీమిండియా.. వీడియో

భారత్ స్వ్కాడ్ లో రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, కొహ్లీ, రాజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, షెహ్ బాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..