Pervez Musharraf: హెయిర్ స్టైల్ గురించి ధోనికి సలహా ఇచ్చిన ముషారఫ్.. ఇంతకీ అదేంటంటే.. వైరల్ అవుతున్న వీడియో
కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోని పొడవైన జుట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో యూత్ అంతా ధోని హెయిర్ కట్ చేయించుకునేవాళ్లు. ఇదే హెయిర్ స్టైల్ ముషారఫ్‌కు కూడా నచ్చింది. దీనిపైనే ధోనికి ముషారఫ్ ఒక సలహా ఇచ్చారు. ఈ ఘటన 2004లో జరిగింది.

Pervez Musharraf: పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ దుబాయ్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముషారఫ్‌కు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా భారత మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ ఎమ్మెస్ ధోనికి ముషారఫ్ సలహా ఇచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Pathaan Row: పఠాన్ ‘బేషరం రంగ్’ వివాదంపై స్పందించిన యోగి ఆదిత్యనాథ్.. ఏమన్నారంటే
కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోని పొడవైన జుట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో యూత్ అంతా ధోని హెయిర్ కట్ చేయించుకునేవాళ్లు. ఇదే హెయిర్ స్టైల్ ముషారఫ్‌కు కూడా నచ్చింది. దీనిపైనే ధోనికి ముషారఫ్ ఒక సలహా ఇచ్చారు. ఈ ఘటన 2004లో జరిగింది. అప్పట్లో టీమిండియా ఒక ద్వైపాక్షిక టోర్నీ కోసం పాకిస్తాన్‌లో పర్యటించింది. అక్కడ లాహార్ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా దక్కింది. ఈ సందర్భంగా ముషారఫ్ చేతుల మీదుగా ధోనికి బహుమతి అందించారు.
Aero India 2023: ఏరో ఇండియా షో కోసం మాంసం విక్రయాలపై నిషేధం.. షోకి, మాంసానికి సంబంధం ఏంటి?
ఆ సమయంలో ముషారఫ్ మాట్లాడారు. ‘‘మ్యాచ్ గెలిచినందుకు ధోనికి అభినందనలు. మీరు హెయిర్ కట్ చేయించుకోవాలంటూ మ్యాచ్ సందర్భంగా ఎవరో ప్లకార్డు పట్టుకోవడం చూశా. ఒకవేళ నా మాట వింటానంటే ఒక సలహా ఇస్తా. ఈ హెయిర్ కట్‌తో చాలా బాగున్నావు. నీ హెయిర్ స్టైల్ అలాగే ఉంచు. హెయిర్ కట్ చేయించుకోవద్దు’’ అని సలహా ఇచ్చాడు. ధోని ఇదంతా నవ్వుతూ విని ముషారఫ్ చేతుల మీదుగా తన షీల్డ్ తీసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
MS Dhoni, who went on to become Lt Col MS Dhoni, didn’t follow General Pervez Musharraf’s advice.
— Rahul Fernandes (@newspaperwallah) February 5, 2023