Women’s Asia cup: నేటి నుంచి మహిళల ఆసియాకప్‌ .. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా

నేటి నుంచి మహిళల ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌ వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో హాట్‌ ఫేవరేట్‌గా టీమిండియా జట్టు బరిలోకి దిగుతోంది.

Women’s Asia cup: నేటి నుంచి మహిళల ఆసియాకప్‌ .. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా

women's asia cup 2022

Women’s Asia cup: నేటి నుంచి మహిళల ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌ వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో హాట్‌ ఫేవరేట్‌గా టీమిండియా జట్టు బరిలోకి దిగుతోంది. కాగా, ఈ టోర్నీలో ఆతిథ్య బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మలేషియా, యూఏఈలతో సహా మొత్తం ఏడు జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో టోర్నీ జరగుతుంది. ఈ టోర్నీలో అన్ని జట్లు ఆరేసి మ్యాచ్‌ లు ఆడనున్నాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ నాలుగు జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్ల మధ్య అక్టోబర్ 15న టైటిల్ పోరు జరగనుంది.

PM Modi To Launch 5G: నేడు 5జీ సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. తొలుత ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి..

నేడు టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు, థాయ్ లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇండియా జట్టు విషయానికొస్తే.. తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత వరుసగా 3న మలేషియా, 4న యూఏఈ, 7న పాకిస్తాన్‌, 8న బంగ్లాదేశ్‌, అక్టోబర్ 10న థాయ్‌లాండ్‌ జట్లతో టీమిండియా తలపడనుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన సూపర్‌ ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్‌ చేరికతో బ్యాటింగ్‌ మరింత పటిష్ఠంగా మారింది. అవసరమైతే హేమలత, కీపర్‌ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా మెరుగ్గానే రాణిస్తున్నారు. షెఫాలీ వైఫల్యం జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. ఇక బౌలింగ్‌లో రేణుకా సింగ్‌ ఠాకూర్‌ తన స్వింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. మరో పేసర్‌ పూజా వస్త్రకర్‌ కూడా నిలకడగా రాణిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా స్పిన్‌ విభాగంలో రాణిస్తున్నారు. వీరందరూ సమష్ఠిగా రాణిస్తే మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలవడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మహిళల ఆసియా కప్‌ చరిత్రలో వన్డేలు, టీ20లు కలిపి మొత్తం 32 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 30 మ్యాచ్‌లు గెలిచింది. ఆరుసార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2018లో జరిగిన చివరి ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది.