WTC Final 2023 : ముగిసిన తొలి రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోర్.. సెంచరీతో కదంతొక్కిన హెడ్
WTC Final : ట్రావిస్ హెడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో చెలరేగాడు. హెడ్ 156 బంతుల్లో 146 పరుగులు చేశాడు.

WTC Final (Photo : Google)
WTC Final 2023 : ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (WTC) ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసింది. ఫస్ట్ డే ఆస్ట్రేలియా జట్టు ఆధిప్యతం ప్రదర్శించింది. ట్రావిస్ హెడ్, స్మిత్ చెలరేగారు. హెడ్ సెంచరీతో కదంతొక్కాడు. దాంతో తొలిరోజు ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.
ట్రావిస్ హెడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో చెలరేగాడు. హెడ్ 156 బంతుల్లో 146 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 22 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరో ఎండ్ లో స్టీవెన్ స్మిత్ కూడా అదరగొట్టాడు. ప్రస్తుతం సెంచరీకి చేరువలో ఉన్నాడు. స్మిత్ 227 బంతుల్లో 95 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు ఉన్నాయి.
ఆసీస్ జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43, మార్నస్ లబుషేన్ 26 పరుగులు చేశారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు తేలిపోయారు. ఆసీస్ బ్యాటర్లు ఆధిపత్యం చూపారు.