Home » 10tv Headlines
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ సెషన్ లో ఉభయ సభల్లో సోమవారం వరకు 95 మంది సభ్యులను సస్పెండ్ చేయగా.. మంగళవారం మరో 49 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వేదికగా పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు.
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారని ఆయన విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
తన కోసం ట్రాఫిక్ని ఆపవద్దంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు విస్తరించాలని తలపెట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అన్ని వసతులు ఉన్న కారిడార్ వెంట మెట్రో ఎందుకని ప్రభుత్వం అభిప్రాయపడింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చాలా సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. ప్రార్థనా స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన రైతుబంధు నిధులను రైతు ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని.. కేసీఆర్ తొందరలోనే కోలుకుంటారు అని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు.. మళ్లీ ప్రజాసేవ చేయాలని అన్నారు.
భార్యకు 18 ఏళ్లకు పైబడి వయసు ఉంటే భారతీయ శిక్ష్మాస్మృతి ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.