Top Headlines : తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల.. బిగ్‌బాస్ గొడవ కేసులో ఇద్దరు అరెస్ట్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ సెషన్ లో ఉభయ సభల్లో సోమవారం వరకు 95 మంది సభ్యులను సస్పెండ్ చేయగా.. మంగళవారం మరో 49 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.

Today Headlines in Telugu at 11PM
తెలంగాణలో కొత్తగా 4 కరోనా కేసులు నమోదు
తెలంగాణ కరోనా బులిటెన్ విడుదలైంది. రాష్ట్రంలో 4 కరోనా కేసులు నమోదయ్యాయ. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇవాళ 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా కరోనా సోకిన వారి స్క్వాబ్ నమూనాలను పరీక్షలకు పంపారు వైద్యులు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ పై టెన్షన్ మొదలైంది. కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల హెచ్చరించారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు వాడాలన్నారు.
డీజీపీగా రవిగుప్త కొనసాగింపు..
తెలంగాణలో ప్రభుత్వం మారాక అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 20 మంది ఐపీఎస్ లు బదిలీలు అయ్యారు. తెలంగాణ డీజీపీగా రవిగుప్తను కొనసాగిస్తూనే 20మంది ఐపీఎస్ లకు స్థానచలనం కల్పించారు. సీఐడీ అడిషనల్ డీజీపీగా శిఖా గోయల్, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా అనిల్ కుమార్, పోలీస్ అకాడెమీ డైరెక్టర్ గా అభిలాశ్ బిస్తా నియమితులయ్యారు.
బిగ్ బాస్ ఫ్యాన్స్ విధ్వంసం.. ఇద్దరి అరెస్ట్
బిగ్ బాస్ ఫ్యాన్స్ వీరంగం కేసుని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విజయోస్తు ర్యాలీ తీసిన ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బిగ్ బిస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తీసుకొచ్చింది ఆ ఇద్దరు కారు డ్రైవర్లే. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రశాంత్ చెప్పడంతో రోడ్డు మీద కార్లను ఆపారు. దాంతో ఆకతాయిలు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. కార్లు, ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు.
22న దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియా కూటమి పిలుపు
పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ ఇండియా కూటమి తీర్మానం చేసింది. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా డిసెంబర్ 22న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపిచ్చింది. మంగళవారం జరిగిన ఇండియా కూటమి భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయని మల్లికార్జున ఖర్గే తెలిపారు. సీట్ల సర్దుబాటు గురించి రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరనే దానికన్నా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం ముఖ్యమని ఖర్గే వ్యాఖ్యానించారు.
కమిన్స్ రికార్డు బద్దలు కొట్టిన మిచెల్ స్టార్క్..
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు అతడిని రూ. 24.75 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని సొంతం చేసుకుంది.ఇదే వేలంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు దక్కించుకుని చరిత్ర సృష్టించగా మిచెల్ స్టార్స్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
పాట్ కమిన్స్ సరికొత్త చరిత్ర
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. రూ.2కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకివ చ్చిన అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ధర అంతకంతకు పెరిగిపోవటంతో మిగిలిన ఫ్రాంచైజీలు పక్కు తప్పుకున్నాయి.చివరకు సన్ రైజర్స హైదరాబాద్ రూ.20.50 కోట్లకు కమిన్స్ ను దక్కించుకుంది.
కూటమి మీటింగ్ షురు..
ఇండియా కూటమి నాలుగో సమావేశం నిర్వహించింది. ఢిల్లీలోని అశోక హోటల్ లో ప్రారంభమైన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ, శరత్ పవార్,బీహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవిత్ కేజ్రీవాల్,పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తేజస్వియాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా పాల్గొన్నారు.
మరో 49 మంది ఎంపీల సస్పెన్షన్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ సెషన్ లో ఉభయ సభల్లో సోమవారం వరకు 95 మంది సభ్యులను సస్పెన్డ్ చేయగా.. మంగళవారం మరో 49 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఫలితంగా ఈ సెషన్ లో సస్పెన్షన్ కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 141 మంది కి చేరింది. ఇవాళ సస్పెండైన వారిలో సుప్రియాసూలే, శశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం, మనీశ్ తివారీ, డింపుల్ యాదవ్, తదితరులు ఉన్నారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
జాతీయ రాజకీయాలపై గులాబీ బాస్ ఫోకస్..
మరోసారి జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగునున్న క్రమంలో కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. దీంట్లో భాగంగా త్వరలోనే ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్డీఏ,ఇండియా కూటమి జాతీయ రాజకీయాల్లో బీఅర్ఎస్ పాత్రపై చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు,రేపు హైదరాబాద్ చేరుకోవాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ లో నెలకొన్న పరిస్థితులపై ఎలాంటి కామెంట్స్ చేయవద్దని ఎంపీలకు పార్టీ సూచనలిచ్చింది.
మళ్లీ కరోనా కలకలం
మరోసారి దేశంలో కరోనా కలకలంతో తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ రోగులకు 30పడకలు, గర్భిణీలకు మరో 20 పడకల్ని కేటాయించారు. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా గాంధీ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
సీబీఐతో విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నేత రఘునందన్ విమర్శించారు. అవినీతి గురించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశచరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని..కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల మాకు అనుమానాలు ఉన్నాయన్నారు.
కేసులు కొట్టివేత
జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం ఐదు పిటిషన్‌లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
అసలేం జరిగింది?
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కో ఆర్డినేషన్ చైర్మన్ నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. నిరంజన్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలు సేకరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
పెరుగుతున్న కొవిడ్ కేసులు ..
కేరళలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 142 కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1970 యాక్టివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 1749 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
మీరు రాకండి ..
వచ్చే ఏడాది జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి బీజేపీ కురవృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరు కావొద్దని రామ మందిరం ట్రస్టు సూచించింది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిద్దరిని రామాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావొద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు.
రుణ యాప్ లు తొలగింపు..
గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 2500 మోసపూరిత రుణ యాప్ లను తొలగించిందని కేంద్ర ప్రభఉత్వం వెల్లడించింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య ఈ చర్య తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్ పార్లమెంట్ లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.