Top Headlines: ఎమ్మెల్యే కేతిరెడ్డికి పరిటాల శ్రీరామ్ కౌంటర్

వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు.

Top Headlines: ఎమ్మెల్యే కేతిరెడ్డికి పరిటాల శ్రీరామ్ కౌంటర్

Updated On : December 16, 2023 / 11:01 PM IST

కేతిరెడ్డి అరాచకానికి టీడీపీ అడ్డుపడుతోంది: పరిటాల శ్రీరామ్

వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ… ఏపీ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందంటూ కేతిరెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేతిరెడ్డి అరాచకానికి మాత్రమే టీడీపీ అడ్డుపడుతుందని చెప్పారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి అమర్‌నాథ్ 
వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను ప్రజలకు చూపిస్తున్నామని చెప్పారు.

బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది: రేవంత్ రెడ్డి

‘ప్రగతి భవన్ ముందు కంచెలను బద్దలుకొట్టి… ప్రజావాణిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంటే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. నాడు.. హోం మంత్రికే ప్రగతి భవన్ లోకి అనుమతివ్వలేదు. మంత్రి ఈటల రాజేందర్ కు అనుమతి ఇవ్వలేదు. అందుకే గేట్లను బద్దలుకొట్టి ప్రజా భవన్ చేశాం. మాది ప్రజా ప్రభుత్వం.. మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం’ అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పారు.

అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ ఆస్తులు, అప్పులపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటుున్నారు సభ్యులు.

మరోసారి ఎంపీగా..
మరోసారి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ నేత బండి సంజయ్ రెడీ అవుతున్నారు. దీని కోసం ఇప్పటినుంచే పార్టీ క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భాగంగా కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో పదాధికారులతో సమావేశమయ్యారు. సంక్రాంతి పండుగ తరువాత జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీని కోసం పార్టీ శ్రేణులు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. 45 రోజులు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటించే ప్లాన్ వేస్తున్నారు.

అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఆకలి కేకలు..మంచినీరు,సాగు నీటి కష్టాలు, గంజి కేంద్రాలు తప్ప ఏమున్నాయి..? మా పదేళ్ల పాలన గురించి కాంగ్రెస్ 50 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడొద్దా..? అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

కేటీఆర్ విమర్శలు..బదులు చెప్పిన ప్రభుత్వం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొత్తగా ఏర్పాడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శల దాడి చేస్తున్నారు. తెలంగాణలో ఆస్తులు పెంచి కాంగ్రెస్ కు అప్పగించాం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ ఎదురు దాడి చేసింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్యంసం జరిగిందంటు విమర్శలకు సమాధానం చెప్పారు.

నామినేట్ సీఎం
బీఆర్ఎస్ పాలనలో విద్యుత్‌ సంస్థలో అప్పులకంటే ఆస్తులెక్కువున్నాయని కేటీఆర్ తెలిపారు. పావలావంతు కూడా కాంగ్రెస్‌ గ్యారెంటీలు అమలు చేయలేదు అంటూ విమర్శించారు. రేవంత్ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు..ఢిల్లీ నుంచి నామినేట్‌ చేసిన ముఖ్యమంత్రంటూ విమర్శించారు.

కౌంటర్..రివర్స్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.

టీడీపీ కార్యాలయంపై దాడి ..
గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రాత్రి 3గంటల సమయంలో దాడి జరిగిందంటూ టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.

రోడ్డు ప్రమాదం..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో ఇద్దురు మృతి చెందారు. మృతులు భూపాలపల్లి జిల్లా వాసులుగా గుర్తించారు.

చర్చలు విఫలం ..
ఏపీ సర్కార్‌తో అంగన్‌వాడీల చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మెను కొనసాగిస్తామని అంగన్‌వాడీ సంఘాల ప్రకటించాయి.

ఆక్రమణలపై కొరడా ..
కుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.

రాష్ట్రపతి రాక..
ఎల్లుండి హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. భద్రతా ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష నిర్వహించారు.

ఇరాన్ ఆఫర్..
విదేశీ టూరిస్ట్‌లకు ఇరాన్‌ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇకనుంచి వీసా లేకుండానే ఇరాన్ రావొచ్చని ప్రకటించింది.