Airtel Xstream Box price : రూ.2 వేలకే ఎయిర్ టెల్ Xstream బాక్స్.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ కూడా..!

Airtel Xstream Box price : ఎయిర్ టెల్ అందించే సర్వీసుల్లో Airtel Xstream కోసం చూస్తున్నారా? ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

Airtel Xstream Box price : రూ.2 వేలకే ఎయిర్ టెల్ Xstream బాక్స్.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ కూడా..!

Airtel Xstream Box Price Reduced To Rs 2000, Subscribers Now Get Free Access To Amazon Prime

Airtel Xstream Box price : ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ అందించే సర్వీసుల్లో ఒకటైన Airtel Xstream సర్వీసు.. అయితే ఈ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఎందుకంటే.. ఇప్పుడు ఈ Xstream Box ధర రూ.499 తగ్గింది. గతంలో ఈ Airtel Xstream Box ధర రూ.2499గా ఉండేది. కానీ, ఇప్పుడు ఈ బాక్సు ధర రూ.400కి తగ్గడంతో కేవలం రూ.2,000కి సొంతం చేసుకోవచ్చు. కొత్త ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్‌ కోసం ఎదురుచూసే వినియోగదారులకు మాత్రమే ఈ కొత్త ధర వర్తిస్తుంది. Xtream బాక్స్‌పై తగ్గిన ధరతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా ప్రముఖ OTT యాప్‌లకు ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ 2019లో రూ. 3999 ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్‌తో పాటు అదే ధర ట్యాగ్‌తో మార్కెట్లోకి వచ్చింది. Airtel అధికారిక వెబ్‌సైట్‌లో Airtel Xstream బాక్స్ కొత్త ధర రూ. 3000 నుంచి రూ. 2000కి తగ్గించినట్లు కనిపిస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అంటే.. మీ ఇంట్లో మామలు టీవీని స్మార్ట్ టీవీగా మార్చే DTH టెలివిజన్ బాక్స్. అమెజాన్ ఫైర్ డివైజ్ మాదిరిగానే ఇది పనిచేస్తుంది. మీ పెద్ద టీవీ స్క్రీన్‌పై నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ మొదలైన వివిధ OTT యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ కంటెంట్‌ను చూడటానికి Xstream బాక్స్ ద్వారా సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9.0 పై-ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌తో రన్ అవుతుంది.

Airtel Xstream Box Price Reduced To Rs 2000, Subscribers Now Get Free Access To Amazon Prime (1)

Airtel Xstream Box Price Reduced To Rs 2000, Subscribers Now Get Free Access To Amazon Prime

యూజర్లు Google Play Store ద్వారా 5000 యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. సాధారణ DTH ఫంక్షనాలిటీతో పాటు స్ట్రీమింగ్ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడానికి మీకు WiFi కనెక్షన్ లేదా మొబైల్ హాట్‌స్పాట్ అవసరం పడుతుంది. Xstream బాక్స్ వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ కూడా ఇంటర్నెట్ వేగంపై ఆధారపడి ఉంటుంది. రూ. 2000కి, మీరు Airtel Xstream సెట్-టాప్ బాక్స్, అవుట్‌డోర్ యూనిట్ (డిష్ యాంటెన్నా, వైర్), రిమోట్, డెలివరీ ఇన్‌స్టాలేషన్‌ను పొందవచ్చు. Airtel మీకు అందుబాటులో ఉన్న ఆఫర్ ప్రకారం.. వ్యాలిడిటీ ధరతో లీనియర్ టీవీ ఛానెల్‌లకు ఉచితంగా సబ్ స్ర్కిప్షన్ కూడా అందిస్తుంది. ప్రతి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో, ముందస్తుగా లింక్ అయిన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లోని కంటెంట్‌కు మీరు 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

DTH-కేంద్రీకృత DreamDTH నివేదిక ప్రకారం.. ఈ ఆఫర్ కొత్త Airtel Xstream కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది కూడా పరిమిత-కాల ఆఫర్ మాత్రమే. మీరు మీ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ఆర్డర్ చేయాలనుకుంటే.. మీరు అధికారిక ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. Airtel Xstream బాక్స్‌ను తగ్గింపు రేటుతో కాకుండా డిస్నీ+ హాట్‌స్టార్, 3 నెలల అమెజాన్ ప్రైమ్ వీడియో, SonyLIV, Eros Now, Hungama ఇతర యాప్‌ల ఉచితంగా ఒక-ఏడాది సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.

Read Also : Airtel Xstream Premium : ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త.. రూ.149కే 15 OTT వీడియో స్ట్రీమింగ్‌ ప్రీమియం సర్వీసులు